Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ క్రేజ్ తగ్గిపోయిందా?... అందుకేనా వైల్డ్ కార్డు ఎంట్రీస్..? బిగ్ బాస్ కప్ ఈసారి ఎవరిని వరిస్తుంది! 

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ క్రేజ్ తగ్గిపోయిందా?... అందుకేనా వైల్డ్ కార్డు ఎంట్రీస్..? బిగ్ బాస్ కప్ ఈసారి ఎవరిని వరిస్తుంది! 

 Bigg Boss 8 Telugu:  బిగ్ బాస్ ఇప్పటికీ ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సీజన్ నడుస్తుంది. ఇప్పటివరకు సీజన్ హోస్ట్గా అక్కినేని నాగార్జున ఎక్కువసార్లు ఉన్నాడు. బిగ్బాస్ సీజన్ వన్ లోజూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ గా చేశాడు. ఆ సీజన్ విన్నర్ శివ బాలాజీ. అలాగే రెండో సీజన్లో హీరో నాని హోస్ట్గా చేశాడు. ఆ సీజన్ విన్నర్ కౌశల్ మండా. ఇక అప్పటినుండి మొత్తం పూర్తిగా నాగార్జున హోస్టుగా ఇప్పటివరకు ఆరు  సీజన్లు చేస్తూ వచ్చాడు. అయితే ఈ బిగ్ బాస్ అనేది తెలుగులో అలాగే కన్నడలో మరియు మరాఠీలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రియాల్టీ షో ల నిర్వహిస్తూ ఉన్నారు. 

ఈ బిగ్ బాస్ రియాల్టీ షో కి చాలామంది ప్రేక్షకులు కూడా వీక్షిస్తున్నారంటే ఈ షో కి ఎంత ఆదరణ ఉంది అనేది మన అందరికి అర్థమవుతుంది. ఈ రియాల్టీ షో వల్ల  చాలామంది రాష్ట్రాల్లో పాపులర్ అయినటువంటి పీపుల్స్ ని తీసుకువచ్చి ఈ బిగ్ బాస్ రియాల్టీ షోలో కొన్ని రోజులు ఉంచి ఒక్కొక్క వారంలో ఒక్కొక్కరిని పంపిస్తూ చివరిగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించినటువంటి అలాగే ఎవరు ఎక్కువగా ప్రేక్షకులను మెప్పించి ఓటింగ్స్లలో ప్రథమ స్థానం నిలబెట్టుకుంటారో ఆ వ్యక్తిని విన్నర్ గా ప్రకటించి కొంత ప్రైజ్ మనీని అందజేయడం ఈ షో యొక్క రూల్. 

 అయితే ప్రతి సంవత్సరం కూడా తెలుగు బిగ్ బాస్ లో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా ఎంటర్టైన్మెంట్ అలాగే మధ్య మధ్యలో షాకింగ్ విషయాలు అలాగే బాధలు సంతోషాలు అన్ని వెదజల్లేలా ఎప్పటికిప్పుడు త్రిల్లింగ్ గా ఉండేటట్టు నిర్వహిస్తారు షో నిర్వాహకులు. అయితే ఈ బిగ్బాస్ 8వ  సీజన్లో ఇప్పటివరకు దాదాపుగా ఆరు మంది ఎలిమినేషన్ కూడా అయ్యారు. అయితే సడన్గా నాగార్జున ఈవారం  మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా నాగార్జున అందరికీ షాక్ ఇస్తూ  ఆదిత్య ఓమ్ని ఎలిమినేట్ చేశారు. 

08 -01
అయితే ఈ షాకింగ్ లో ఉండగానే మరొక షాకింగ్ న్యూస్ తో నాగార్జున ముందుకు వచ్చాడు. అదేంటంటే వైల్డ్ కార్డు ఎంట్రీస్ కంటెస్టెంట్స్. అవును ఆదివారం జరిగినటువంటి బిగ్ బాస్ షోలో సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభించి వైట్ కార్డు ఎంట్రీస్ తో దాదాపుగా 8 మందిని హౌస్ లోకి పంపించాడు హోస్ట్ నాగార్జున. ఈ వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా వచ్చిన వారందరూ కూడా గత 8 సీజన్లో ఉన్నవారే. వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 ఆదివారం జరిగినటువంటి బిగ్బాస్ రియాల్టీ షోలో హోస్ట్ నాగార్జున 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా బిగ్ బాస్ లోకి పంపించాడు. వీరిలో గంగవ్వ, హరితేజ, టేస్టీ తేజ, ముక్కు అవినాష్, నయిని పావని, మెహబూబా, గౌతమ్, రోహిణి వీళ్ళందరూ కూడా వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. అయితే ఇందులో వచ్చిన వారందరూ కూడా గడిచిన ఏడు సీజన్లలో ఉన్న వారే కావడం విచిత్రం. ఇందులో హరితేజ ఫస్ట్ సీజన్, రోహిణి మూడవ సీజన్, (గంగవ్వ,మెహబూబా,అవినాష్) నాలుగవ సీజన్,నయిని పావని, గౌతం కృష్ణ, టేస్టీ తేజ ఏడో సీజన్లో ఉన్న వారె. వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా బిగ్బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. 

 ఈ బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ అనేది ఇప్పటికే చాలా మలుపులు తిప్పుకుంటూ ఎప్పటికప్పుడు వీక్షించే ప్రేక్షకులకు   టెన్షన్స్ పెట్టేస్తూ  హోస్ట్ నాగార్జున ముందుండి నడిపిస్తున్నాడు. అయితే ఈ బిగ్ బాస్ 8 సీజన్ వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా వచ్చినవాళ్ళు అందరూ కూడా పోయిన అన్ని సీసన్స్ లో ఏదో ఒక సీజన్లో ఉన్నవారే కావడం తో చాలా మంది ప్రేక్షకులు బిగ్ బాస్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లే కాకుండా ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండే వాళ్ళు కూడా కొంచం షాక్ కి గురయ్యారు. గత సీజన్లో గంగవ్వ   అనారోగ్యంతో  ఉండలేక బిగ్బాస్ హౌస్ నుండి వెళ్లిపోయిన ఘటన మనందరికీ తెలిసిందే. అలాగే మెహబూబా, నయిని పావని,  

08 -03
గౌతమ్ ఇలాంటి వారందరూ కూడా మంచి పర్ఫార్మ్ చేసి మరి ఎలిమినేషన్ అయినవారె. అయితే ఇలాంటి వాళ్లని పదేపదే తీసుకువచ్చి ప్రజలకి ఎటువంటి సందేశం ఇవ్వాలని చూస్తున్నారని బిగ్బాస్ పై కొంతమంది ప్రేక్షకులు మండిపడుతున్నారు. బయట టాలెంట్ ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. కొత్త కొత్త వ్యక్తులను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువస్తే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది ఈ సీజన్లో వచ్చిన కొత్త వ్యక్తులు సరిగా ఎంటర్టైన్మెంట్ అందించలేకపోతున్నారు అని అంటున్నారు. ఈ సీజన్ కొంత సాఫీగా జరిగిపోతుందడం తో నాగార్జున గత సీజన్లో లో బాగా ఎంటర్టైన్మెంట్ చేసిన వల్లనే మళ్ళీ రప్పించారని అందరూ అనుకుంటున్నారు. 

 ప్రతి సీజన్లో కూడా అన్ని రంగాలకు సంబంధించిన వారిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకునేవారు. అంటే పాటలు పాడే వ్యక్తి, డాన్స్ చేసే వ్యక్తి, ప్రజలను నవ్వించే వ్యక్తి, సీరియల్స్ లో నటించే వ్యక్తి,అలాగే మిమిక్రీ చేసే వ్యక్తి,సినిమాకి సంబంధించిన వ్యక్తి,  సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తి, ఒక యూట్యూబర్,  ఒక అందమైన అమ్మాయి ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకువచ్చేవారు. 

08 -04
కానీ ఈ సంవత్సరం మాత్రం అందరూ సోషల్ మీడియాకు సంబంధించిన వారే ఎక్కువగా ఉండడం అందరూ చింతిస్తున్న విషయం. అందుకే ఈ సంవత్సరం సాఫీగా జరిగిపోతున్న బిగ్ బాస్ కు గత సీజన్లలో ఎంటర్టైన్మెంట్ అందించిన అన్ని సీజన్లకు సంబంధించిన వ్యక్తులను వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా తీసుకున్నారు. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా కొత్త వ్యక్తులను తీసుకొస్తే బాగుండేది ప్రతి ఒక్కరు కూడా అదే మాట అంటున్నారు. 

వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు బాగా స్థిరపడి ఉన్నవాళ్లే.  కనీసం కొత్త వ్యక్తులకు అవకాశం కల్పిస్తే వారు కూడా బాగా మంచి అవకాశాన్ని అందించుకున్న వాళ్లగా   అయ్యవారు కదా అని అందరూ అంటున్నారు. మరి ఈ సీజన్లో ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తుల గురించి ఆల్రెడీ తెలిసిన విషయమే. మరి ఈ బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ ఎవరు విన్ అవుతారు అనేది చెప్పండి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?