సీనియర్ ఎన్టీఆర్ అన్న ఆ ఒక్క మాటతో చిరంజీవి ఇన్నాళ్లు ఇదే చేస్తూ వచ్చారా..?

సీనియర్ ఎన్టీఆర్ అన్న ఆ ఒక్క మాటతో చిరంజీవి ఇన్నాళ్లు ఇదే చేస్తూ వచ్చారా..?

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో నంద‌మూరి తార‌క రామారావు (సీనియ‌ర్ ఎన్టీఆర్‌)  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు.  తెలుగు ప్రజలు ఆయనను ఆరాధ్యదైవంగా భావిస్తుంటారు. ఏ పాత్రనైనా అలవోకగా చేసి మోప్పించగలిగే సత్తా ఉన్న నటులలో ఆయన ఒకరు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలో ఆయనను మించిన నటుడు ఇప్పటివరకు ఎవరూ లేరు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.తెలుగు తెరపై ఆయన నటుడు గానే గాక రైటర్గా,దర్శకుడుగా, నిర్మాతగా వ్యవహరించారు. అందుకే ఇప్పటికి ఆయన పేరు ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఆయన రాముడిగా,కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా ఏ పాత్ర వేసిన అందులో ఒదిగిపోయి నటించేవారు. ఇక ఎన్టీఆర్ తన అనుబంధాన్ని తోటి నటీనటులతో ఎంతగానో  ఏర్పరచుకున్నారు. సినీ పరిశ్రమలో నందమూరి తారకరామారావు తర్వాత అగ్ర హీరోగా ఎదిగిన మరొక హీరో చిరంజీవి.


చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలకు వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే చిరంజీవి మొదటగా సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఒక సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఎన్టీఆర్ నటించిన సినిమాలో చిరంజీవి నటనను చూసి అద్భుతంగా నటిస్తున్నవ్ బ్రదర్ అంటూ చిరంజీవిని పొగిడాడు. ఈ మూవీలో ఒక ఫైట్ సీన్ లో ఇద్దరు కలిసి చేయాల్సి ఉండగా, ఇద్దరూ కలిసి ఒక గ్లాస్ మీద దూకాలి అని డైరెక్టర్ చెప్పగానే వెంటనే చిరంజీవి గాల్లో రెండు రౌండ్స్ వేసి గ్లాసు మీద దూకాడట. దాంతో ఎన్టీఆర్ చిరంజీవి దగ్గరకు వెళ్లి బ్రదర్   మనకి డూప్ లు ఉన్నారు కాదా మనం దూకినట్టుగా చిన్న యాక్షన్ చేస్తే చాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్పాడంట. హీరో అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఒకవేళ హీరోకి ఏదైనా గాయం జరిగి కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే అప్పుడు సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోతుంది. అప్పుడు దర్శకుడు కి నష్టంతో పాటు అక్కడ పనిచేసే కార్మికులకు కూడా పని లేకుండా పోతుంది. అందువల్ల ఆర్టిస్టులకు హెల్త్ ఇంపార్టెంట్. 

రిస్కు షార్ట్స్ ఉంటే డూప్ లతో చేయాలి అని చెప్పారట. ఎన్టీఆర్ చిరంజీవికి ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్ చేయకండి అంటూ ఒక అద్భుతమైన మాట చెప్పారట. ఇక ఆ మాట చిరంజీవి గుర్తుంచుకొని ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ విషయాన్ని గుర్తు  చేసుకుంటాడు. అంతేకాక ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి చిరంజీవి ఈ విషయాలను చెప్తూ డూప్ లను వాడుకోవాలని సలహాలు ఇచ్చేవాడట. నిజానికి ఆర్టిస్టులు ఒక ప్రత్యేకమైన వ్యక్తులు అని చెప్పాలి. వాళ్లు రెండు మూడు నెలల మూవీస్ కి బ్రేక్ ఇస్తే అందరూ చాలా ఇబ్బంది పడాల్సిఉంటుంది. అందువల్ల వీళ్ళు కచ్చితంగా డూప్ లను వాడుకోవలసి ఉంటుంది.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?