Chiranjeevi SSC Certificate Viral : సోషల్ మీడియాలో చిరంజీవి పదో తరగతి సర్టిఫికెట్ లీక్.. మెగాస్టార్ కు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
అది కూడా తన సొంత టాలెంట్ ను నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు చిరంజీవి. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే చాలామంది హీరోలు, దర్శకులకు చిరంజీవి ఒక రోల్ మోడల్. ఆయన్ను చూసే ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లు కోకొల్లలు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.
Chiranjeevi SSC Certificate Viral : సర్టిఫికెట్ లో కేఎస్ఎస్ వరప్రసాద రావుగా చిరంజీవి పేరు
ప్లేస్ ఆఫ్ బర్త్ ప్లేస్ లో పెనుగొండ అని రాసి ఉంది. అలాగే.. ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా అందులో రాశారు. సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పేరుతో వైరల్ అవుతున్న ఆ ఫోటోను చూసి చిరంజీవి అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు. అన్నయ్య పదో తరగతి సర్టిఫికెట్ ను చూసే భాగ్యం తమకు కలిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. అది చిరంజీవి పదో తరగతి మార్క్స్ లిస్ట్ కాకపోవడంతో అందులో మెగాస్టార్ కు ఎన్ని మార్కులు వచ్చాయో మాత్రం తెలియలేదు. పదో తరగతి పూర్తయ్యాక.. కాలేజీ చదువు కోసం తీసుకునే టీసీలా ఆ సర్టిఫికెట్ ఉంది. టెన్త్ తర్వాత చిరంజీవి.. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్ చదివారు. ఆ తర్వాత నర్సాపురంలోని శ్రీ వైఎన్ కాలేజీలో డిగ్రీ చదివారు. ఆ తర్వాత సినిమాల్లో ఆసక్తి ఏర్పడటంతో మద్రాస్ కు వెళ్లారు.
ఇక.. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాకు వశిష్ఠ డైరెక్టర్. ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.
1978 లో చిరంజీవి.. పునాది రాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. డిగ్రీ చదువు పూర్తయ్యాక 1976 లో మద్రాస్ కు వెళ్లిన చిరంజీవి అక్కడ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో నటన నేర్చుకున్నారు. ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని తనను తాను మార్చుకుంటూ నటనలో బెస్ట్ అనిపించుకొని నేడు కోట్లాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి.