Chiranjeevi: రచ్చ గెలిచి.. ఇంట గెలిచానని చిరంజీవి భావోద్వేగం.. ఆయన ప్రసంగాని అందరూ ఎందుకు ఫిదా అయ్యారంటే..
అయితే ప్రస్తుతం సినీ రంగంలో తాను రచ్చ గెలిచి ఇంట గెలిచానని వ్యాఖ్యానించారు మెగాస్టార్ చిరంజీవి. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు నందుకోవడంతో తాను ఇంట గెలిచారని గర్వంగా చెప్పుకొచ్చాడు. ఈ వజ్రోత్సవాల సందర్భంగా తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకొని చిరంజీవి తీవ్రంగా భావోద్వేగానికి ఎన్నడూ లేనటువంటి విధంగా గురయ్యారు.
ఇకపోతే అమితాబచ్చన్ చిరంజీవి గురించి చాలా మంచిగా మాట్లాడారు. చిరంజీవి మరియు నాగార్జున అలాగే నాగస్విని వంటి వారు నన్ను తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపుతో ఒక హీరోగా నిలబెట్టారని చెప్పుకొచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో నేను కూడా ఒక సభ్యుడు నేను అని గర్వంగా చెప్పుకుంటూ తెలుగు చిత్రశ్రమలు నన్ను ఓ భాగంగా పరిగణించండి అంటూ అలాగే ఇండియన్ సినిమాలకు అక్కినేని నాగేశ్వరావు చేసినటువంటి సేవలు చెప్పుకోలేనటువంటివి అని చిరంజీవి నేను ఎప్పుడు ఏది అడిగినా కూడా కాదనకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి ప్రేమ అలాగే అభిమానానికి నేనెప్పుడూ కూడా రుణపడి ఉంటానని అమితాబచ్చన్ చెప్పుకొచ్చాడు.
ఆయన మాటలు చాలా స్ఫూర్తినిచ్చాయని చెప్పుకొచ్చారు. నీకు అలాగే ఇండియన్ సినిమాకు బాద్ షా అయినటువంటి అమితాబ్ నుంచి అవార్డు స్వీకరించడం అనేది చాలా గర్వంగా ఉందని చిరంజీవి అన్నారు. తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఓనాడు నా మదిలో ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇంట గెలిచానని అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంట గెలిచే అవకాశం తెలుగు సినిమా వద్దురా ఉత్సవాల సమయంలో వచ్చింది. నాకు అప్పుడు లెజెండ్రీ పురస్కారం ప్రధానం చేశారు.
కానీ కొన్ని అనుకూల పరిస్థితుల వల్ల కొందరు వ్యక్తులు ఆశించిన కారణంగా ఆ పురస్కారాన్ని తీసుకోవడం సరైనదిగా అనిపించలేదు. అందుకే ఆరోజు అవార్డుని ఓ క్యాప్సిల్ బాక్స్ లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటానని చెప్పాడు. ఆరోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ది గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డును ది గ్రేట్ అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా అందుకున్న కాబట్టి ఇప్పుడు నేను ఇంట గెలిచాను... రచ్చ గెలిచాను అనిపిస్తుందని భావోద్వేగానికి గురవుతూ చెప్పాడు చిరంజీవి.
ఇక ఈ ఫిలిం స్టూడియోలోనే అక్కినేని నాగార్జున కూడా అమితాబచ్చన్ గురించి అలాగే చిరంజీవి గురించి చాలా మంచి వాక్యాలు చేశారు. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తులను గౌరవించడమే ఏఎన్ఆర్ అవార్డు ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. ఈరోజు ఈ వేదికపై ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు ఉన్నారని వాళ్లు ఈ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని పై స్థాయికి తీసుకెళ్తున్నారని చెప్పుకొచ్చాడు.
వాళ్లు మరెవరో కాదు బిగ్ బి అమితాబచ్చన్ అలాగే మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాది ఏఎన్ఆర్ పురస్కారాన్ని నా మిత్రుడు పద్మ విభూషణం చిరంజీవి అందిస్తున్నందుకు మా కుటుంబ సభ్యులందరూ గర్విస్తున్నామని అలాగే ఆనందిస్తున్నామని చెప్పుకొచ్చాడు. అలాగే దీన్ని మేము అందరం ఎంతగానో ఆరాధించే పద్మ విభూషణ్ అమితాబచ్చన్ గారు ప్రజెంట్ చేయడం అనేది ఈ వేడుకకు మరొక ప్రత్యేకమని చెప్పుకొచ్చారు..