Samantha and allu arjun : సామ్ - బన్ని కాంబో... పుకార్లు పై క్లారిటీ
ఈ నేపథ్యంలోనే ఇటీవల అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో మరో మూవీ కన్ఫర్మ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా పూర్తి వివరాలను మూవీ టీమ్ ఎప్పుడైనా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవల బాలీవుడ్ లో అట్లీ జవాన్ మూవీ తో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అందుకనే ఆయన సినిమా కోసం హిందీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోకి ఫాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్ వస్తుంది. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా అని వార్తలు వస్తున్నప్పటి నుంచి ఎప్పుడు ఈ సినిమా మొదలు పెడతారో ఎప్పుడు విడుదల చేస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా వీరిద్దరి కాంబో లో వస్తున్న సినిమా లో హీరోయిన్ విషయంలో కొన్ని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక సమంత విషయానికి వస్తే ఏడాది బ్రేక్ తీసుకున్న తరువాత తిరిగి షూటింగ్స్ కు హాజరయ్యేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు మయోసిస్ అనే వ్యాధితో బాధపడిన సమంత ఇప్పుడు ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకొని ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబోలో రాబోయే సినిమాకు , హీరోయిన్ గా సమంత ను , నిర్ణయించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే సమంత మరియు అల్లు అర్జున్ ఇదివరకే కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించడం జరిగింది. అంతేకాక ఇటీవల వచ్చిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో సమత కనిపించి పిచ్చెక్కించింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుందని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. సమంత బన్ని కాంబినేషన్ లో సినిమా వస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.