Chiranjeevi : నమ్మిన వాళ్ల చేతిలో మోసపోయిన చిరంజీవి.. అసలు ఏం జరిగింతో తెలుసా..?

 Chiranjeevi : నమ్మిన వాళ్ల చేతిలో మోసపోయిన చిరంజీవి.. అసలు ఏం జరిగింతో తెలుసా..?

 Chiranjeevi : చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. చిరంజీవికి పద్మవిభూషణ్ అనే బిరుదు కూడా వచ్చింది. తెలుగు ప్రజలందరి చేత మెగాస్టార్ చిరంజీవి అనిపించుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు. ఆయన సినిమా రంగంలో ఒక లెజెండ్. సినీ పరిశ్రమలోకి ఆయన తుఫాన్ల రాలేదు చిరుజల్లు లాగా వచ్చాడు. మన పెద్దవాళ్లు మంచితనం ఎప్పుడూ పనికిరాదని చెబుతూ ఉంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో మంచి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు మంచి పేరును సాధించుకోవాలని కోరుతుంటారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తాడు. అందులో కొందరు వాటిని సద్వినియోగం చేసుకుంటే మరి కొందరు మాత్రం మిస్ యూస్ చేసుకొని వాళ్ళకి బ్యాడ్ నేమ్  తెచ్చుకుంటారు. అంతేకాక చిరంజీవికి కూడా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లలో ఒకరు యండమూరి వీరేంద్రనాథ్. చిరంజీవికి యండమూరి కి మొదటి నుంచి మంచి సన్నిహిత్యం ఉండేది..

యండమూరి రాసిన నవలలన్ని చిరంజీవి సినిమాలుగా తెరకెక్కించిగా అవి మంచి విజయాలను అందుకున్నాయి. ఆయనకు దర్శకుడుగా కూడా అవకాశం ఇచ్చి మంచిగా ఎంకరేజ్ చేశాడు. చిరంజీవి హీరోగా చేసిన 'స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ 'అనే సినిమాకి ఆయనను దర్శకుడుగా తీసుకున్నాడు. యండమూరి కి దర్శకత్వంలో పెద్దగా పరిజ్ఞానం లేదు. ఆ సినిమా షూటింగ్ మధ్యలోకి వచ్చిన తర్వాత తన వల్ల కాదు అని వదిలేశాడు. అయినప్పటికీ చిరంజీవి ఆ సినిమాను అప్పుడు వదిలేయవచ్చు కానీ ప్రొడ్యూసర్ ఇప్పటిదాకా పెట్టిన డబ్బులు నష్టపోతాడు అని ఆలోచించాడు. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసిన సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని సంగతి తెలిసినా దాన్ని రిలీజ్ చేసి వచ్చిన డబ్బుల్ని ప్రొడ్యూసర్ కి ఇచ్చాడు. ఆ సినిమా  ఫ్లాప్ కావటమే కాక  చెత్త సినిమా చేశారని చిరంజీవికి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

 చిరంజీవి రీసెంట్ గా భోళా శంకర్ అనే మూవీతో భారీ ప్లాపు తన ఖాతాలో వేసుకున్నాడు. పది సంవత్సరాల కిందట షాడో మూవీ తో భారీ డిజాస్టర్ తీసిన మెహర్ రమేష్ కి ఇప్పటి వరకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఎందుకు అనగా ఆయన తీసిన మూడు నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు డిజాస్టర్లే కావటం ఒక విశేషం. కానీ చిరు తనకి లైఫ్ ఇవ్వాలని తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయినా 'వేదాళం ' సినిమాను తెలుగులో బోళాశంకర్ అని పేరుతో ఈ మూవీ చేశాడు. అందువల్ల చిరంజీవికి మరొకసారి బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. చిరంజీవి మంచితనం వల్లే చాలా వరకు తను ఇబ్బంది పడాల్సి  వస్తుంది అంటూ ఆయన శ్రేయోభిలాషులు  తెలియజేశారు. చిరంజీవి ఇలా ఎంతోమందికి సహాయం చేసి వాళ్ల చేతుల్లో మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల అతి మంచితనం కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది.

 

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?