Bigg Boss Season 8 : నాగార్జునని కూడా భయపెట్టే బిగ్ బాస్ ఎవరో తెలుసా..? ఆ స్వరం ఇతనిదే...?
అయితే ప్రస్తుతం గత రెండు మూడు సీజన్ నుండి నాగార్జున చేస్తున్నా విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ నీ మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ బిగ్ బాస్ అనేది ఇంకా ఎంతో పాపులర్ అయింది. ఎక్కడో విదేశాల్లో బిగ్ బ్రదర్ రియాలిటీ షో గా ప్రాచుర్యం పొందిన ఈ టెలివిజన్ ప్రోగ్రామ్ అనేది మన ఇండియాలోకి బిగ్ బాస్ రూపంలో వచ్చింది. మొదటిగా హిందీలో 2006లో బాలీవుడ్ నటుడైన హర్షద్ వార్షి అనే నటుడు బిగ్ బాస్ సీజన్ 1 ప్రారంభించారు.
ఇక రెండో సీజన్లో తదితర కారణాలవల్ల ఎన్టీఆర్ తప్పుకొని అప్పుడే సెటిల్ అయినటువంటి నానికి ఈ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ సీజన్ మొత్తం నానికి అంతగా గుర్తింపు రాలేదు అలాగే ఈ రియాల్టీ షో కూడా ఆదరణ అనేది తగ్గిపోయింది. ఇక మూడవ సీజన్ కొస్తే నాని కొన్ని కారణాలవల్ల బిగ్ బాస్ సీజన్ 2 లో తప్పుకున్నాడు. ఇక వెంటనే బిగ్ బాస్ ఏమాత్రం పాపులర్ లేని వాళ్ళని కాకుండా ఆ టైంలో ఎక్కువగా పాపులర్టీ ఉన్న నాగార్జునను హోస్టుగా చేశారు. ఇక నాగార్జున హోస్టుకి చేసిన ఈ మూడో సీజన్ ప్రజలను మరింతగానో ఆదరణని రేకెత్తించింది.
ఈ మూడో సీజన్ నాగార్జున కి ఎంతగానో పాపులారిటీ తెచ్చింది. ఏకంగా టి ఆర్ పి లు కూడా బాగా పెరిగాయని అప్పట్లో న్యూస్ కూడా చాలానే వచ్చాయి. అయితే ఇప్పటివరకు చెప్పినదంతా బిగ్ బాస్ ని సక్సెస్ చేయడంలో ఒక వంతు పోషించినటువంటి హోస్ట్ గురించే మాత్రమే చెప్పుకున్నాం. కానీ దీని వెనుక ఒక రహస్య స్వరం ఉందంటే అది నమ్మాల్సిందే.
అవును మీరు విన్నది నిజమే. బిగ్బాస్ వాయిస్ ఎవరు అనేది ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఇతని వల్ల బిగ్ బాస్ వేరే స్థాయిలో ఉందంటే అది కచ్చితంగా అవును అని చెప్పాలి. ఏకంగా పోస్ట్ గా చేసి నాగార్జున కూడా బిగ్బాస్ మాట వినాల్సిందే. అంటే అతనికి ఎంత పాపులారిటీ ఉందనేది అర్థమవుతుంది. కానీ ఆయన ఎవరో ప్రతి ఒక్కరికి తెలియదు. ఇప్పుడు అతని గురించి మనం తెలుసుకుందాం.
ఈ రియాల్టీ షోలో తెర వెనక ఉండి బిగ్ బాస్ వాయిస్ లో మాట్లాడి అందరిని ఇంట్రెస్టింగ్ గా చూసేలాగా చేసిన అతని పేరు రేణుకుంట్ల శంకర్. ఇతను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇతను చాలా సీరియల్స్ కి అలాగే కొన్ని సినిమాలు కూడా డబ్బింగ్ చేశాడు. ఈ శంకర్ వాయిస్ అనేది బిగ్ బాస్ చాలా ఇష్టంగా సెలెక్ట్ చేసుకుందంటే నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన వాయిస్ వేరే లెవల్లో ఉంటుంది కనుక. కనుక అతని బిగ్ బాస్ వాయిసర్ గా ఎన్నిక చేసుకున్నారు.
కాగా ఇప్పటికే 7 సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకుని ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కి అంతా సిద్ధం చేస్తూ వచ్చారు. ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఈ సెప్టెంబర్ 7వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుందని ముందుగానే ప్రకటన చేశారు. దీంతో ప్రేక్షకులలో మరొక ఆనందం బయటికి వచ్చింది. దీనికి మరోసారి నాగార్జున హోస్ట్ గా నిర్వహించనున్నాడు.
ఈసారి కూడా ఎంటర్టైన్మెంట్ కి, ట్విస్టులకు, ఫన్కు లిమిట్ లేదని నాగార్జున పలు యాడ్స్లలో చెప్పుకొస్తూనే ఉన్నారు. నాగార్జున చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ సీజన్ ఇంకొంచెం సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇప్పటికే కొంతమందికి బిగ్ బాస్ సీజన్ 8 కి కంటెస్టెంట్స్ ఎవరనేది తెలిసిపోయే ఉంటుంది. చూద్దా0 మరి ఈ సంవత్సరం ఎవరు విన్నర్ అవుతారో..