Game Changer : గేమ్ ఛెంజర్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన చెర్రీ.. రిలీజ్ డేట్ ఫిక్స్..
అయితే సినీ పరిశ్రమలో రామ్ చరణ్ అందించిన సేవలను గుర్తించి చెర్రీకి డాక్టరేట్ గౌరవాన్ని అందించినట్లుగా డీజీ సీతారాం తెలియజేశారు. దీంతో ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో సినీ ప్రముఖులు మరియు అభిమానులు రామ్ చరణ్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛెంజర్ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల రామ్ చరణ్ గేమ్ ఛెంజర్ సినిమాపై కీలక అప్డేట్ తెలియజేశారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ గేమ్ ఛెంజర్ పొలిటికల్ సినిమా అని తెలిపారు. ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదల చేస్తామని , పాన్ ఇండియా లెవెల్ లో దాదాపు 5 భాషల్లో దీనిని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా రామ్ చరణ్ తెలియజేశారు. అయితే గత కొంతకాలంగా రామ్ చరణ్ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు గేమ్ ఛెంజర్ రిలీజ్ పై స్పష్టత ఇచ్చేశారు చెర్రీ.
కచ్చితంగా ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ సినిమా విడుదల అవుతుందని తేలియజేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీ మాత్రమే అనౌన్స్ చేయాల్సి ఉంది. అంతేకాక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదలైన "జరగండి జరగండి" పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ గేమ్ ఛెంజర్ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా సమాచారం. అంతేకాక ఈ సినిమాలో తొలిసారి రామ్ చరణ్ ఓ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. అలాగే మరో పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా నటించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ బ్యూటీ కీయార అద్వానీ,అంజలి, శ్రీకాంత నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలై రామ్ చరణ్ కు ఎలాంటి పేరు తెచ్చి పెడుతుందో వేచి చూడాలి మరి.