Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛెంజర్ సినిమకు మళ్ళీ బ్రేక్..
అయితే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కీయారా అద్వానీ నటిస్తోంది. పొలిటికల్ మరియు యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ గేమ్ చేంజర్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అంతేకాక సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి మెగా అభిమానులకు భారీ షాక్ తగిలిందని చెప్పాలి. అయితే ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా చాలా ఆలస్యం అవుతూ వస్తుండగా మరోసారి సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ వర్గాలలో అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఆలస్యానికి అదే కారణమా...
అయితే రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడుతూ వచ్చింది. అంతేకాక మూవీ టీమ్ కూడా ఈ సినిమాకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ ను ఇవ్వకుండా దాచేస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ లో విడుదలవుతుందని అభిమానులు ఆత్రుతగా చూస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి సినిమా వాయిదాకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.
అయితే ఈ న్యూస్ ప్రచారం కావడానికి గల ముఖ్య కారణం దర్శకుడు శంకర్ అని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం దర్శకుడు శంకర్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో పాటు విశ్వనటుడు కమలహాసన్ తో ఇండియన్ 2 అనే సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రెండు సినిమాలకు శంకర్ పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించలేకపోయారు. దీంతో గేమ్ చేంజర్ సినిమా మరింత ఆలస్యమైందని తెలుస్తోంది. ఈ కారణం వల్లనే ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యంగా నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి ఈ సినిమాకు వాయిదా పడక తప్పదని తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా మరోవైపు రాంచరణ్ అభిమానులు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ వార్త అందరిని కలవరపెడుతోంది. మరి దీనిలో నిజం ఎంత అనేది తెలియదు కానీ ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే కచ్చితంగా మూవీ యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సిందే.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ కియారా అద్వానీ తో పాటు క్యూట్ బ్యూటీ అంజలి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో సముద్రఖని , ఎస్ జె సూర్య ,శ్రీకాంత్ ,సునీల్ మరియు నవీన్ చంద్ర , ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత దర్శకత్వం అందిస్తున్నారు.