Hero Navdeep Marriage Fix : పెళ్లికి రెడీ అయిన హీరో నవదీప్.. ముహూర్తం కూడా ఫిక్స్.. లాస్ట్‌లో ట్విస్ట్ అదుర్స్
అయితే.. ఇటీవల నవదీప్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టాడు. దాంట్లో ఏముందంటే ప్రతి రోజు ఇంట్లోకి వెళ్లినా ఇన్ స్టాగ్రామ్ కు వెళ్లినా ఒకటే క్వశ్చన్.. అది ఎప్పుడూ అని. చెప్తా. రేపు చెప్తాను. అది నా పెళ్లి డేట్ అయి ఉండొచ్చు.. లవ్ మౌళి రిలీజ్ డేట్ అయి ఉండొచ్చు.
ఆ వీడియోను చూసిన నెటిజన్లు మొత్తానికి నవదీప్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అని గెంతులేశారు. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నాడేమో. అందుకే రేపు చెప్తా అంటున్నాడు కదా. అమ్మాయి ఎవరో.. పెళ్లి ఎప్పుడో అని అంతా తమ ఊహల్లో మునిగి తేలిపోయారు.
ఇక.. రివీలింగ్ డేట్ రానే వచ్చింది. అసలు విషయం చెప్పేశాడు నవదీప్. పెళ్లి శుభలేఖను ఓ బాక్స్ లో పెట్టి ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు. ఎంతోకాలంగా నన్ను ప్రేమిస్తున్న మీరందరూ ఆశగా ఎదురు చూస్తున్న డేట్ మీ ముందే ఉంది. యస్. అది జరగబోతోంది. మీరు రెడీయా అంటూ ఆ బాక్స్ ను ఓపెన్ చేసి.. మరోసారి మూసేసి.. చూపిస్తా ఆగండి అని చివరకు ఆ బాక్స్ ను ఓపెన్ చేసి చూపించాడు నవదీప్.
అందులో ఒక శుభలేఖ ఉండటంతో ఇక అది ఖచ్చితంగా నవదీప్ పెళ్లి అని అంతా అనుకున్నారు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏప్రిల్ 19న లవ్ మౌళి మూవీ రిలీజ్ కాబోతోందని ఉంది. మీ అభిమాన థియేటర్లలో మాత్రమే. అదిదా మ్యాటర్. ఏప్రిల్ 19, లవ్ మౌళి రెడీ రెడీ.. అంటూ వీడియోను ముగించి తన అభిమానుల ఊహలకు బ్రేక్ వేశాడు నవదీప్.
ఈ సినిమా కోసం నవదీప్ మూడేళ్ల పాటు శ్రమించాడు. ఈ సినిమాలో పంఖురి గిద్వానీ హీరోయిన్. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో నవదీప్.. సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు అవనీంద్ర డైరెక్టర్. అలాగే.. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రచన అన్నీ అవనీంద్రనే చూసుకున్నాడు. నవదీప్ ఈ మధ్య హీరోగా ఏ సినిమాలో నటించలేదు. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో అయితే నటించాడు.
కానీ.. పూర్తి స్థాయి హీరోగా చాలా గ్యాప్ తర్వాత లవ్ మౌళి సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు ప్రమోషన్స్ మాత్రం నవదీప్ చాలా వెరైటీగా చేస్తున్నాడు. తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే సినిమా ప్రమోషన్స్ ను చేస్తున్నాడు. తన వినూత్న ప్రమోషన్స్ కూడా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.