తెలుగు పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సంచలన కేరాఫ్ అడ్రస్ గా మారాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న కాంబినేషన్ వీరిద్దరిది. అలాంటి హిట్ సినిమాలలో ' ముఠామేస్త్రి ' సినిమా కూడా ఒకటి .1993 లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అభిలాష, న్యాయం కావాలి, ఖైదీ, విజేత, ఛాలెంజ్, పసివాడి ప్రాణం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన ముఠామేస్త్రి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగి దుర్మార్గుల ఆట కట్టించడం కోసం మళ్లీ కూలీగా మారే బోసు పాత్రలో చిరంజీవి అదరగొట్టారు. వీటికి తోడు పాటలు, డాన్సులు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా చూడడం కోసం థియేటర్లకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు.
రికార్డు స్థాయిలో వసూలు చేసిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కె. శేఖర్ బాబు, డి. శివప్రసాద్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో రోజా, మీనా, రత్ సక్సేనా, మున్సూర్ అలీఖాన్, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, గుమ్మడి వెంకటేశ్వరరావు, అల్లు రామలింగయ్య ముఖ్యపాత్రలో నటించారు. పరుచూరి సోదరులు సంభాషణలు అందించగా ఈ సినిమాకి ఎస్ గోపాల్ రెడ్డి సినిమా ఆటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ముఠామేస్త్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఒక సామాన్య మానవుడు రాష్ట్రానికి సీఎం అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఇచ్చిన ఈ సినిమా అద్భుతం అని చెప్పాలి. అయితే ఈ సినిమా చివర్లో కోర్టు సీను ఉంటుంది. ఆ సన్నివేశంలో సాక్ష్యం కోసం పక్కన మసీదులో ఒక ముస్లిం నమాజ్ చేస్తూ ఉంటే దానిని సాక్ష్యంగా సృష్టిస్తూ దోషులకు శిక్ష విధించాలి అంటూ చిరంజీవి సినిమాలో వారిస్తాడు. అప్పట్లో ఈ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సీన్ ఒక కొరియన్ సినిమాలో నుంచి తీసుకొని దానిని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిమీద సినిమా యూనిట్ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. అయితే అప్పట్లో మాత్రం ఈ సన్నివేశం కొరియన్ సినిమా నుంచి కాపీ చేశారు అని వార్తలు అయితే వచ్చాయి. అయినా ఈ సీన్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ వయసులో కూడా ఆయన హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ సక్సెస్లను కూడా సాధిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సీనియర్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. చిరంజీవి సూపర్ సక్సెస్ సాధించడానికి ఎప్పుడు కూడా ముందు వరుసలా ఉంటుంటారు. ఇక ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే చిరంజీవి మార్కెటు ఇంకా భారీగా పెరుగుతుంది అనడం ఎటువంటి అతిశయోక్తి లేదు.