Junior NTR Devara Movie Shooting : ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ వీడియో లీక్.. తారక్ గెటప్‌కి ఫ్యాన్స్ ఫిదా.. సోషల్ మీడియాలో వైరల్ 

Junior NTR Devara Movie Shooting : ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ వీడియో లీక్.. తారక్ గెటప్‌కి ఫ్యాన్స్ ఫిదా.. సోషల్ మీడియాలో వైరల్ 

Junior NTR Devara Movie Shooting : ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర సినిమాకు తన డేట్స్ మొత్తం ఇచ్చేశాడు. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి కూడా చాలా రోజులు అవుతోంది. ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. దేవర మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఈ మూవీకి సంబంధించిన టైటిల్, పోస్టర్, టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కానీ.. ఇప్పటి వరకు ఈ సినిమాలో తారక్ గెటప్ ఎలా ఉంటుందో? అసలు ఈ సినిమా నేపథ్యం ఏంటో బయటికి రాకుండా మూవీ యూనిట్ జాగ్రత్త పడింది. కనీసం మూవీ షూటింగ్ సమయంలో కూడా ఎలాంటి వీడియోలు, ఫోటోలు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో లీక్ కాలేదు.

కానీ.. తాజాగా దేవర షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేవర షూటింగ్ లో ఎవరో ఎన్టీఆర్ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

227 -3

Junior NTR Devara Movie Shooting : లుంగీ కట్టుకొని వెరైటీ గెటప్ లో ఎన్టీఆర్

ఆ క్లిప్ లో సముద్రం ఒడ్డున బీచ్ లో లుంగీ కట్టుకొని, భుజం మీద టవల్ వేసుకొని ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. షూటింగ్ కు దగ్గర్లో ఎవరో ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించడం చూసి జనాలు ఫిదా అవుతున్నారు. హమ్మయ్య.. తమ హీరో గెటప్ ను కనీసం ఇప్పటికైనా చూశాం అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈరోజుల్లో సినిమా ఇలా షూటింగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కొత్తేమీ కాదు.

బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాల షూటింగ్స్ లోనూ అదే జరిగింది. పుష్ప, పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమాల షూటింగ్ లకు సంబంధించిన క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ.. దేవర సినిమా నుంచి ఇప్పుడే ఎన్టీఆర్ లుక్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్టీఆర్ సరికొత్త లుక్ గురించే టాలీవుడ్ లో చర్చిస్తున్నారు. 

227 -2

దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. కొరటాల శివ ఈ మూవీకి డైరెక్టర్. రెండు పార్ట్స్ షూటింగ్ వరకు ఎన్టీఆర్ ఈ మూవీతోనే అసోసియేట్ అయి ఉంటాడు. దేవర పార్ట్ వన్ సినిమాను అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎన్టీఆర్ సరసన నటిస్తోంది.

అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీ, కొడుకు రెండు పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేవర గ్లింప్స్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. దాంట్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. దేవర ఫస్ట్ సింగిల్ ను జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు మే 20న విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?