Kalki 2898 AD: మరోసారి వాయిదా పడ్డ కల్కి. మంచి శకున "మే"నా..
ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి సినిమాను తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. యువ దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకోన్నాయి. అంతేకాక ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ మరియు మూవీ లీక్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
కల్కి మూవీ ని రూపొందిస్తున్న వైజయంతి బ్యానర్ కు మే 9 అనేది చాలా సెంటిమెంట్ డేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ బ్యానర్ పై వచ్చిన సినిమాలు ఆ డేట్ లో విడుదల అయి భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్నాయి. దీంతో కల్కి సినిమాని కూడా అదే డేట్ రోజు విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం అది కుదిరేలా కనిపించడం లేదు.
ట్రేడ్ వర్గాల మాట....
అలాగే ఓవర్సీస్ లో కూడా కల్కి సినిమాకు పెద్ద ఎత్తున స్క్రీన్లు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాక మే 30 నాటికి భారత్ లో ఎన్నికలు హడావిడి కూడా పూర్తవుతుంది. అలాగే ఐపీఎల్ సీజన్ కూడా మే 26 లోపు కంప్లీట్ అవుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ కల్కి సినిమాపై పడే అవకాశం లేదు.అలాగే విద్యార్థులందరికీ కూడా సెలవులు ప్రకటిస్తారు.
ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ మరియు ట్రేడ్ నిపుణులు కల్కి సినిమాను మే 30న విడుదల చేయడం సరైన సమయం అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సమయంలో కల్కి సినిమా విడుదలయితే సాలిడ్ ఓపెనింగ్స్ రావడం పక్కా అని చెబుతున్నారు.
ఓవర్సీస్ లో విడుదల....
ఇది ఇలా ఉండగా కల్కి 2898 ఏడి మూవీ ని భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదలకు సిద్ధం చేశారు. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాలో బిగ్ బీ అమితాబచ్చన్ , కమల్ హాసన్ దీపికా పదుకొనే, దిశాపటని రాజేంద్రప్రసాద్ , పశుపతి వంటి మహానీయులు కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.