Mammootty : మమ్ముట్టికి షాక్.. సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోల్.. అసలేం జరిగింది?
మమ్ముట్టిపై నెటిజన్లు విరుచుకుపడటం వెనుక ఒక కారణం ఉంది. అదే మమ్ముట్టి నటించిన ఓ సినిమా. అది కూడా ఇప్పుడు వచ్చిన సినిమా కాదు. రెండేళ్ల క్రితం వచ్చిన సినిమా. ఆ సినిమా గురించి ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మమ్ముట్టిపై ఇంత దారుణంగా ట్రోల్స్ రావడం ఇదే మొదటి సారి. కానీ.. మమ్ముట్టికి కొందరు బాసటగా నిలిచారు. కేరళ పొలిటికల్ లీడర్స్ మాత్రం మమ్ముట్టిపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టి ఆయనకు మద్దతు పలికారు.
Mammootty : కొన్ని సీన్స్ ఓ వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆగ్రహం
ఆ మూవీ డైరెక్టర్ రథీనా భర్త ఇటీవల ఓ న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆ మూవీ గురించి కూడా మాట్లాడారు. ఆ మూవీ ఓ వర్గానికి వ్యతిరేకంగా ఉందని.. అలాంటి సినిమాలో నటించడం ఏంటి అంటూ మమ్ముట్టినే ఆయన విమర్శించారు.
మమ్ముట్టి ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్న సినిమాలో నటించడం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ట్రోల్స్ పై మమ్ముట్టి అయితే ఇప్పటి వరకు స్పందించలేదు కానీ.. ఆయన అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు.
అలాగే.. కేరళ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. పలువురు సీనియర్ నేతలు, మంత్రులు మలయాళ ప్రజలకు, కేరళ రాష్ట్రానికి గర్వకారణం అయిన మమ్ముట్టిపై ఇలా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదన్నారు.
దీంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగినట్టు అనిపించినా.. సోషల్ మీడియాలో మమ్ముట్టిపై ట్రోల్స్ మాత్రం ఆగలేదు. చూడాలి మరి.. దీనిపై మమ్ముట్టి ఎలా స్పందిస్తారో?