Movie actors : వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సినీ యాక్ట‌ర్స్‌.. ఎవరెవరు ఎంత ఇచ్చారంటే..

Movie actors : వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సినీ యాక్ట‌ర్స్‌.. ఎవరెవరు ఎంత ఇచ్చారంటే..

Movie actors :  ప్రస్తుతం వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. సాధారణంగా తుఫాన్ లాంటి రెండు మూడు రోజులు ఉండిపోతూ ఉంటాయి. దాదాపు 20 ఏళ్లుగా  ఎన్నడూ లేనటువంటి వర్షాలు  ఈ సంవత్సరం అందర్నీ నష్టాల్లోకి నెట్టేసాయి. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో కొన్ని జిల్లాల్లో  పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణాజిల్లా అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా  తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నది వల్ల విజయవాడ మొత్తం నీట మునిగిపోయింది.  అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల వాగులు వంకలు తెగిపోవడం లేదా ఎక్కువైపోవడం వల్ల పొరలిపోయి ప్రజలణు తీవ్రమైన నష్టాల్లో  ముంచేసింది. 

 అయితే ఎన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇలాంటి వరదలు ఇదే ఫస్ట్ టైం రావడం అని  అన్ని న్యూస్ ఛానల్ లో అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ళందర్నీ ఆదుకోవడానికి ఇప్పటికే రెండు రాష్ట్రాలు  పెద్ద ఎత్తున విరాళాలను సేకరిస్తుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మీద కలిపి 40 నుండి 50 మంది వరకు చనిపోయారని వీళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు నష్టపరిహారాలు అందజేశారు. అయితే ఇప్పటికి ఇంకా నీటిలో మునిగి ఉన్న ప్రజలను కాపాడడానికి కొన్ని రెస్క్యూ టీంలను  అలాగే సహాయ కేంద్ర  సెల్ నెంబర్లను కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. 

 ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నీట మునిగినటువంటి కృష్ణానది తీర ప్రాంతమైన విజయవాడలో మోకాలు లోతున నీటిలో నడుస్తూ అందరి కష్టాలను తెలుసుకుంటూ అందరిని ఆదుకుంటూ ఉంటున్నాడు. అయితే వీటన్నిటిని చూస్తూ  సినీ ప్రముఖులు భారీగా విరాళాలు అందజేశారు. ఏకంగా పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తూ మంచి మనసును చాటుకున్నారు.

05 -03

 ఇప్పటికే ప్రభాస్ 5 కోట్ల వరద బాధితుల కోసం ఇస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకు మరియు ఆంధ్రప్రదేశ్ కు  50 లక్షలు చొప్పున రెండు రాష్ట్రాలకు కోటి రూపాయలు ఇచ్చాడు. వీరితో పాటుగా  చిరంజీవి కూడా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చాడు. అలాగే మహేష్ బాబు కూడా కోటి రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేశాడు. వీళ్ళతోపాటుగా హీరో విశ్వక్సేన్ రెండు రాష్ట్రాలకు ఐదు లక్షలు చెప్పిన విరాళం ప్రకటించాడు.

అలాగే డీజె టిల్లు తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన  సిద్దు జొన్నలగడ్డ కూడా 30 లక్షలు వరద బాధితుల కోసం విరాళంగా ప్రకటించాడు.  వీళ్లతో పాటుగా కొంతమంది డైరెక్టర్లు కూడా విరాళాలను ప్రకటించారు. ఇంతటితో ఆగిపోకుండా కల్కి మూవీ నిర్మాత కూడా తన మొత్తంలో కొంత సాయాన్ని ప్రకటించాడు. ఇలా సినీ ప్రముఖులందరూ తమకు తోచినంత డబ్బుని వరద బాధితుల కోసం  విరాళంగా ఇస్తున్నారు. 

 అయితే ఎప్పటికప్పుడు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్కు వచ్చి చూసే మన తెలుగు రాష్ట్ర ప్రజలు  ఇవాళ వరద నీటిలో ఇలా చిక్కుకుపోవడం చూసి చలించి తట్టుకోలేక పెద్ద మొత్తంలో విరాళాలని ప్రకటిస్తున్నారు మన టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు. ఏది ఏమైనా సరే వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రజలను  ఆదుకోవడానికి ముందుకు వస్తున్న సినిమా హీరోలను చూస్తూ ఉంటే  ఎంతో ఆనందంగా ఉందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమా హీరోలకి అభినందనలు తెలియజేస్తున్నారు. 

 అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు. ఏది ఏమైనా సరే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా తమకు తోచినంత సహాయాన్ని అందిస్తుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అధికారులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంతే కాకుండా ప్రభుత్వ హోటల్స్ అలాగే ప్రైవేటు హోటల్స్ కూడా ప్రజలకు భారీగా ఆహారాన్ని సరఫరా చేస్తూ ఆదుకుంటూ తమ మంచి మనసును చాటుకుంటూ ఉన్నారు. 

05 -02

 ఇప్పటికే పలువురు ప్రముఖులు భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించారు. అన్ని వైపుల నుండి వరద బాధితులకు ఆహారాన్ని సరఫరా చేస్తూ ఎప్పటికప్పుడు  అన్ని నీ పరిశీలిస్తూ ఉన్నారు.  ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద సినిమా ప్రేమికులు అలాగే రాజకీయపరంగా అధికారులు అన్ని సేవలలో నిమగ్నమై ఉన్నారు.

ఇంత పెద్ద మొత్తంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు  వరద బాధితుల కోసం డబ్బును విరాళంగా ఇవ్వడం వల్ల  ప్రభుత్వ మీద ఒత్తిడి లేకుండా సులభంగా అందరికీ సహాయం చేయవచ్చని చాలామంది అభినందిస్తున్నారు. అలాగే ఇంతటి సహాయం అందించిన హీరోలకి  తమ తమ అభిమానులు భారీ ఎత్తున కామెంట్స్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 

 అయితే వరద బాధితుల కోసం ప్రతి ఒక్కరు చేస్తున్న కృషిని కూడా అందరూ గుర్తిస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ చేస్తూ వస్తున్నారు. దీంతో తెలియని వారు కూడా ఎప్పటికప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయేలా ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం చేస్తూ ఉన్నారు. ఈ అల్పపీణాల వల్ల వర్షాలు ఇంకా మూడు నాలుగు రోజులు పాటు ఉండటం వల్ల  ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉండడం వల్ల ఇంకా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించే అవకాశం ఉంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?