Naveen Polishetty Accident : జాతి రత్నాలు హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్.. బైక్ నుంచి కింద పడి?
ఆయన ప్రమాదం జరిగింది కూడా ఇక్కడ కాదు.. అమెరికాలో అని అంటున్నారు. తన కొత్త మూవీ షూటింగ్ కోసం నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం యూఎస్ లో ఉన్నారు. ఈనేపథ్యంలో ఆయన బైక్ నుంచి కింద పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన బైక్ నుంచి కింద పడటంలో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది.
నవీన్ చేయికి ఫ్రాక్చర్ కావడంతో పాటు రెండు నెలలు ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో నవీన్ పొలిశెట్టి సినిమాలు ఆలస్యం కానున్నాయి. రెండు నెలల వరకు ఆయన షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో నవీన్ కొత్త సినిమాలేవీ ఇప్పట్లో రిలీజ్ అయ్యే చాన్స్ లేదు. అలాగే.. ఆయన షూటింగ్ కూడా లేట్ అయ్యే చాన్స్ ఉంది.
నవీన్ పొలిశెట్టి హీరోగా నటించింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జాతిరత్నాలు మూవీ నవీన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అనుష్క శెట్టితో.. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించాడు.
ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో నవీన్ కు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నవీన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జాతిరత్నాలు 2 మూవీ కూడా త్వరలో పట్టాలెక్కనుంది. నవీన్ కథల ఎంపికలో చాలా వైవిధ్యం ప్రదర్శిస్తాడు. మంచి కంటెంటె ఉన్న స్టోరీలకే తన ఓటు వేస్తాడు. అందుకే నవీన్ సినిమాలు ఆలస్యం అవుతుంటాయి.
జాతి రత్నాలు సినిమా తర్వాత మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా కోసం నవీన్ చాలా ఏళ్ల పాటు కష్టపడ్డాడు. ఆ సినిమా కోసమే కొన్నేళ్ల పాటు డెడికేట్ గా వర్క్ చేశాడు. ఇప్పుడు మళ్లీ జాతిరత్నాలు లాంటి సినిమా కోసం నవీన్ కష్టపడుతున్నాడు కానీ.. ఇంతలోనే యూఎస్ లో తనకు యాక్సిడెంట్ అవడంతో తన సినిమాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి.
దీనికి సంబంధించిన అప్ డేట్ ఏదైనా నవీన్ నుంచి కానీ.. అతడి టీమ్ నుంచి వస్తుందేమో అని ఆయన అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. అసలు ఇది నిజమా.. అబద్ధమా.. అబద్ధం అయితే ఎంత బాగుండు అని సోషల్ మీడియాలో నవీన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.