ఎన్టీఆర్ ఎంత‌ చెప్పినా సూప‌ర్ స్టార్ కృష్ణ వినిపించుకోలే.. అందుకే ఆయ‌న డిజాస్ట‌ర్ అయ్యాడు.. 

ఎన్టీఆర్ ఎంత‌ చెప్పినా సూప‌ర్ స్టార్ కృష్ణ వినిపించుకోలే.. అందుకే ఆయ‌న డిజాస్ట‌ర్ అయ్యాడు.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న స్టార్ హీరోలలో నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు, సూపర్ స్టార్ కృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ టాలీవుడ్ లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ తెలుగు తెరపై నటుడిగానే కాకుండా రైటర్ గా, దర్శకుడిగా , నిర్మాతగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. అలాగే జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం ఇలా ప్రతి జోనర్లో ఆయనకి తిరుగు లేదనిపించుకున్నారు. ఏ పాత్రనైనా అలవోకగా చేయగలిగే సత్తా ఆయనకు ఉంది. ముఖ్యంగా పౌరాణిక పాత్రలో ఆయనను మించిన నటుడు ఇప్పటివరకు ఎవరు రాలేదు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాముడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా ఏ పాత్ర వేసిన అందులో ఓదిగిపోయినటించడం ఆయన నైజం. అందువ‌ల్లే ఇప్పటికి కూడా ఆయన పేరు తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో చిర‌కాలంగా నిలిచిపోయింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ గా ఎదిగారు.

సీనియర్ ఎన్టీఆర్ కన్నా కృష్ణ జూనియర్ అయినా.. తన సినిమాలతో స్టార్ డం సంపాదించుకున్నారు. అయితే ఒకానొక టైంలో ఎన్టీఆర్ కృష్ణ సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి. అందులో ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ పై చేయి సాధిస్తే ఇంకోసారి కృష్ణ పై చేయి సాధించేవారు. అయితే ఎన్టీఆర్ నటించిన ' దానవీరశూరకర్ణ ' సినిమాకి పోటీగా కృష్ణ ' కురుక్షేత్రం ' సినిమా రిలీజ్ చేశారు. అయితే కురుక్షేత్రం సినిమా డిజాస్టర్ అయింది కానీ దానవీరశూరకర్ణ సినిమా మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ రెండు సినిమాలు 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. అయితే ఎన్టీఆర్ ముందుగా కృష్ణతో కురుక్షేత్రం సినిమాని వేరే డేట్ కి విడుదల చేయమని చెప్పారట. అయినప్పటికీ కృష్ణ మాత్రం పండగ సీజన్ కాబట్టి దానిని క్యాష్ చేసుకోవాలని ఈ సినిమాను జనవరి 14వ తేదీన విడుదల చేయాలని మొదటినుంచి అనుకున్నారు..దీనితో ఆయన అదే రోజు సినిమాను విడుదల చేశారు. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైనప్పటికీ దానవీరశూరకర్ణ సినిమా ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందింది.

కృష్ణ కురుక్షేత్రం సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అప్పటి నుంచి వీళ్ళ సినిమాల మధ్య పోటీ నెలకొంది. అందులో కొన్నిసార్లు కృష్ణ పై చేయి సాధించారు. మరికొన్నిసార్లు ఎన్టీఆర్ పై చేయి సాధించారు. ఇక మొత్తానికైతే సీనియర్ హీరోల మధ్య ఆ తర్వాత కొన్ని విభేదాలు కూడా వచ్చాయి. దానివల్ల వీరిద్దరూ చాలా వరకు సఫర్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే తెలుగు సినిమాని అగ్రస్థాయికి తీసుకెళ్లిన నటులలో వీళ్ళిద్దరూ ముందు స్థానంలో ఉండడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. కృష్ణ సినిమాల పరంగా ఎన్టీఆర్ కంటే జూనియర్ అయినప్పటికీ చాలా ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు. ఎన్టీఆర్ కూడా అన్ని రకాల సినిమాలు చేసి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. రైటర్ గా దర్శకుడిగా నిర్మాతగా పలు సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే పాలిటిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?