Pawan Kalyan Good news : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు శుభవార్త .. రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్
అవి ఎప్పుడు మొదలవుతాయా అని ఎంతగానో వేచి చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు తిరిగి మళ్లీ సినిమా ఫీల్డ్ లోకి వస్తున్న పవన్ కళ్యాణ్ ని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో నుండి ప్రస్తుతం మూవీస్ కి షిఫ్ట్ అయ్యి పలు సినిమాలు పూర్తి చేయాలని అనుకున్నారు పవన్ కళ్యాణ్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు హరిహర వీరమల్లు సినిమాతో మళ్లీ ముందుకు వచ్చాడు. హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో సెట్ వేసి ఒక భారీ యాక్షన్ సీన్ ని షూట్ చేస్తున్నారు.
ఓ జి, ఉత్సధ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు ఆగిపోయాయి. దీంతో అటు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ మరియు పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా అభిమానులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు రాజకీయనేతగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇక మీద సినిమాలు చేస్తారని ఆలోచననే వదులుకున్నారు. అతని నమ్మిన సినీ ఇండస్ట్రీని వదలకుండా అనుకున్నట్టుగానే మూడు సినిమాలను త్వరలో చేస్తానని హామీ ఇచ్చాడు.

దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు హరిహర వీర మల్లు స్టార్ట్ చేయించి మూవీ బృందంతో సెట్స్ లో పాల్గొన్నాడు. ఈ మూవీ తర్వాత చేయాల్సిన ఓ జి, ఉత్సద్ భగత్ సింగ్ మూవీలో కూడా డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ అటు రాజకీయంగా ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా సమాంతరంగా పనిచేస్తున్నారని ఫ్యాన్స్ అతని డెడికేట్ కి సలాం కొడుతున్నారు. ఇప్పటిదాకా ఎంతోమందిలో గందరగోళానికి ఆయన ఈ మాటతో తీపి కబుర్ని అందజేశారు. ఏదైతేనేం పవన్ కళ్యాణ్ తిరిగి మళ్ళీ సినిమాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఫ్యాన్స్ అందరూ వెల్కమ్ చెబుతున్నారు.
అయితే వీటన్నిటిలో ఏ మూవీ థియేటర్లో ముందు వస్తుందో సస్పెన్స్ గా ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలు తీయడం పక్కాగా ఫిక్స్ అని అందరూ అంటున్నారు. మరికొందరు సినిమాలు తీస్తే రాజకీయంగా పవన్ కళ్యాణ్ వెనుక పడుతారని కొందరు రాజకీయ నేతలు అంటున్నారు. దాదాపు 25 సంవత్సరాలు పాటు సినీ ఇండస్ట్రీలో ఉంటూ అలాగే రాజకీయ నేతగా కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా భారతదేశమంతటా అటు సినీ ఇండస్ట్రీలోనూ మరియు ఇటు రాజకీయ నేతగాను ఎంతో గుర్తింపు పొందారు.
ఈమధ్య జరిగినటువంటి ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి లో కూడా పిఠాపురం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గురించి తన రాజకీయం గురించి కూడా చర్చలు జరిపారు. 2019లో ఒక సీటు కూడా తెచ్చుకొని పవన్ కళ్యాణ్ ఇప్పుడేకంగా 21 సీట్లకు గాను 21 గెలిచి వైసీపీకి క్లీన్ స్వీప్ చేసి తన సామర్థ్యం ఏంటో తన బలం ఏంటో అందరికీ అర్థం అయ్యేలా చేశాడు. దాదాపు 10 ఏళ్లుగా ఎంతమంది వ్యతిరేక నాయకులు పవన్ కళ్యాణ్ లైఫ్ గురించి ఎంత ఇబ్బంది పెట్టినా సరే అవి ఏం పట్టించుకోలేదు..
తను దాదాపు 25 సంవత్సరాల నుండి ఉన్న సినీ ఇండస్ట్రీని వదిలేసి రాజకీయంలోకి వచ్చి సొంత పార్టీని ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూటమితో కలిసి ఘన విజయాన్ని అందించి తన అన్నయ్య చిరంజీవికి అంకితం చేశాడు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపించాడు పవన్ కళ్యాణ్. ఏదైనా సాధించాలంటే కాస్త ఓపికతో కూడా ఉండాలని చెప్పి అందరికీ ఓపికను, ఓర్పును నేర్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. తన భార్యలను ఎంత అవమానించినా సరే అవి ఏం పట్టించుకోలేదు
ప్రతిపక్ష పార్టీలను తన మాటలతో తోటల్లో దూసుకెళ్తూ అందరినీ నోరుమూయించి 100% రాజకీయాల్లో నెగ్గిన పర్సన్ గా పవన్ కళ్యాణ్ నిలిచాడు. ఏకంగా సీఎం స్థాయి తర్వాత డిప్యూటీ సీఎం గా ఎన్నుకోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవలను అందిస్తున్నాడు. అంతేకాకుండా జనసేన పార్టీ తరఫునుండి హెల్త్ కార్డులను కూడా అందజేశాడు. ఎంతమందికి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇవాళ తను అనుకున్న నిర్ణయాన్ని సాధించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు.
ఇన్నాళ్లుగా దాదాపు 8 నెలల నుండి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో అటు రాజకీయ నేతల నుండి సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి ప్రశంసలు వెళ్ళబడుతున్నాయి. లైన్ లో ఉన్న మూడు సినిమాలకు పవన్ కళ్యాణ్ డేట్ ఇచ్చి పూర్తి చేయనున్నారు. కనుక పవన్ కళ్యాణ్ చేసే సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మూడు సినిమాలు ఎప్పటికీ థియేటర్లోకి రిలీజ్ అయ్యి ఏవి బ్లాక్ బస్టర్ పడతాయో, ఏమి ప్లాప్ అవుతాయో వేచి చూడాల్సిందే.