Prabhas: బాలీవుడ్ హిట్ కలెక్షన్ల కన్నా.. ప్రభాస్ ఫ్లాప్స్ సినిమా కలెక్షన్లే ఎక్కువ
ఇందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ మరియు టాలీవుడ్ హీరోలు అప్పుడప్పుడు కొన్ని పరస్పరవివాదాలు చేసుకుంటున్నారు. ఈమధ్య రిలీజ్ అయిన కల్కి మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసినదే. ఏకంగా 1200 కోట్లను దాటి యావత్ భారతదేశాన్ని వేరు స్థాయిలో నిలిపిన మన ప్రభాస్ గురించి బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు భారతదేశంలోనే వివాదంగా మారాయి.
సిద్దు జొన్నలగడ్డ ప్రభాస్ జోకర్ కాదు యావత్ భారతదేశాన్ని గర్వించదగ్గ చేసే తెలుగు హీరో అని చెప్పుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియా అంతా తెగ గ0దరగోళం గోళం నెల కొంది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదేవ్యవహారం నడుస్తుంది. ఏదైనా సరే ఇంతలా ఒక స్టార్ హీరో పైన అనడం తప్పేనని సిద్దు జొన్నలగడ్డ తెలిపారు. అంతేకాకుండా కల్కి సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడం వెనుక ప్రభాస్ పాత్ర చాలా ఉందని అన్నాడు.
ఏదైనా ఒక మాట అనే ముందు ఒక నటుడిగా నీకు ఎంత బాధ్యతగా ఉంటుందో వేరే వాళ్లనే ముందు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని కామెంట్ చేశాడు. ఒక సినిమా రంగంలోకి నువ్వు ఎలా వచ్చి ఇప్పుడు ఇంతలా నిలుచున్నావు అనేది నీకు తెలుసు... అలాంటిది వేరే వాళ్లకు కూడా సినిమా ఇండస్ట్రీలో అంత సులభంగా ఎదగలేరు. కాబట్టి అంతటి స్థాయి ఉన్న హీరో ని ఏదైనా మాట అనే ముందు జాగ్రత్త అని తెలియచేసాడు.
సినిమా ఇండస్ట్రీలో విమర్శలు అనేవి వ్యక్తం చేయవచ్చు.. కానీ జోకర్ లాంటి పదాలు వాడకూడదని అర్షద్ కి రికౌంటర్ ఇచ్చాడు. ఏ సినిమా అయినా ప్రతి ఒక్కరికి నచ్చాలని రూలు లేదు కానీ సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ప్రభాస్ క్రేజ్ మాత్రంతగ్గడం ఎవరి వల్ల సాధ్యం కాదని.. తద్వారా మనిషి ముఖ్యం కానీ సినిమా క్యారెక్టర్ కాదని చెప్పుకొచ్చాడు. ఈ విషయాలు బాలీవుడ్ లో మరియు టాలీవుడ్ లో చాలా వైరల్ గా మారాయి.
ప్రభాస్ కి టాలీవుడ్ అంతా ఇప్పుడు కూడా అండగా ఉంటుందని యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ అన్న మాట మీద మనకి చాలా సులభంగా అర్థమవుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు అనేవి సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ అని అందరూ అంటున్నారు. ఇలా మాట ముందు ఆలోచించకుండా అంతటి స్టార్ హీరో ప్రభాస్ ప్రభాస్ గురించి అలా కామెంట్ చేయడం టాలీవుడ్ సినీ ప్రియులకు అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే టాలీవుడ్ సినిమా ప్రియులు బాలీవుడ్ మీద ఇంకా కోపాన్ని పెంచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.