Rashmika : రష్మిక మందన్నా బర్త్‌డేకు రెడీగా ఉండండి.. ఫ్యాన్స్‌కి ఊహించని సర్‌ప్రైజ్

Rashmika  : రష్మిక మందన్నా బర్త్‌డేకు రెడీగా ఉండండి.. ఫ్యాన్స్‌కి ఊహించని సర్‌ప్రైజ్

Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుసు కదా. తను ఇప్పుడు తెలుగు హీరోయిన్ మాత్రమే కాదు.. బాలీవుడ్ లో కూడా తనకు చాలా క్రేజ్ ఉంది. బాలీవుడ్ హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ తనకు ఇప్పుడు దక్కుతోంది అంటే దానికి కారణం పుష్ప మూవీ. 

ఆ మూవీ ద్వారా తనకు చాలా క్రేజ్ వచ్చింది. నేషనల్ క్రష్ గా మారింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు కూడా తనతో మూవీస్ తీయడానికి క్యూ కడుతున్నారు. పుష్ప తర్వాత యానిమల్ లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది రష్మిక. అందులోనూ చాలా నాచురల్ గా నటించింది. అది కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో మరోసారి తన క్రేజ్ పెరిగింది. 

ప్రస్తుతం తను పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ.. వేరే సినిమాలకు కూడా సైన్ చేసింది. మీకో విషయం తెలుసా? రష్మిక మందన్నా బర్త్ డే దగ్గరికి వచ్చింది. ఏప్రిల్ 5 నే తన బర్త్ డే. ఇంకో ఐదు రోజులే ఉంది. ఏప్రిల్ 5, 1996 లో రష్మిక జన్మించింది. అంటే తన వయసు 27 ఏళ్లు. త్వరలో తన బర్త్ డే రాబోతున్న సందర్భంగా తన ఫ్యాన్స్ కు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది ఈ సుందరి. 

314 -1

Rashmika Mandanna Birthday Special : ది గర్ల్ ఫ్రెండ్ నుంచి క్రేజీ అప్ డేట్ 

రష్మిక మందన్నా చాలా కాలం నుంచి ఓ సినిమా కోసం కష్టపడింది. అదే ది గర్ల్ ఫ్రెండ్. ఆ సినిమా నుంచి క్రేజ్ అప్ డేట్ వచ్చేసింది. అది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఆ సినిమాను హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్ ను రష్మిక మందన్నా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్టు డైరెక్టర్ ప్రకటించాడు.

ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీ. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ డైరెక్టర్. 

ఇక.. రష్మిక నటిస్తున్న పుష్ప 2 మూవీ కూడా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ప్రస్తుతం తన చేతుల్లో ఐదు పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. అందులో పెద్ద మూవీ పుష్ప2. దాని తర్వాత ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న మరో మూవీ. చావా అనే మరో బాలీవుడ్ మూవీలో కూడా రష్మిక నటిస్తోంది.

314 -4

ఈ మూడు పాన్ ఇండియా మూవీస్. కానీ.. వీటిలో పుష్ప 2 షూటింగ్ తోనే ప్రస్తుతం రష్మిక బిజీగా ఉంది. ముందు పుష్ప 2 షూటింగ్ పూర్తయితే ఆ తర్వాత తను ధనుష్, చావా మూవీస్ షూటింగ్ లో పాల్గొనే చాన్స్ ఉంది. ఈ సంవత్సరం జూన్ కల్లా పుష్ప 2 షూటింగ్ పూర్తవుతుందట.  ఆ తర్వాత ధనుష్ మూవీ షూటింగ్ కూడా ఆగస్టు వరకు పూర్తి చేసుకొని ఆ తర్వాత ది గర్ల్ ఫ్రెండ్ మూవీ షూటింగ్ కు హాజరు అయ్యే చాన్స్ ఉంది.

యానిమల్ మూవీ సక్సెస్ తర్వాత బాలీవుడ్ నుంచి రష్మికకు చాలా ఆఫర్ల వస్తున్నాయి కానీ.. తనకు సమయం లేక కొన్ని పెద్ద సినిమాలను కూడా రష్మిక తిరస్కరిస్తోంది. డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోంది. అందుకే తన చేతుల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాకే కొత్త మూవీస్ ఒప్పుకోవాలని రష్మిక భావిస్తోంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?