Star Hero New Movie in Facebook : ఆ స్టార్ హీరో కొత్త మూవీని ఫేస్‌బుక్‌లో రిలీజ్ చేసిన డైరెక్టర్.. షాక్‌లో నిర్మాత
అయితే అన్ని సినిమాలు కాదు కానీ.. కొన్ని సినిమాలు మాత్రమే ఓటీటీల్లో రిలీజ్ అవుతుంటాయి. కొత్త సినిమాలు అయినప్పటికీ థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తుంటారు కొందరు నిర్మాతలు.
Star Hero New Movie in Facebook : డైరెక్టర్, హీరోకి మధ్య ఉన్న గొడవే కారణమా?
అయితే.. ఈ సినిమాకు శశిధరన్ డైరెక్టర్. ఈ సినిమా నిర్మాత కూడా హీరో టోవినో థామస్. ఈ సినిమా షూటింగ్ కూడా రెండేళ్ల క్రితమే పూర్తయినా.. ఈ సినిమా ఇంకా సెన్సార్ కు వెళ్లలేదు. అదే సమయంలో థామస్, డైరెక్టర్ శశిధరన్ మధ్య చిన్న గొడవలు వచ్చాయి.
దీంతో శశిధరన్ ఆ సినిమాను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశాడు. ఆ సినిమా సెన్సార్ కాకముందే, థియేటర్లలో రిలీజ్ కాకముందే సినిమా పైనల్ కాపీ మొత్తాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ సినిమాను ఫేస్ బుక్ లో ఎవ్వరైనా చూడొచ్చు.
ఈ విషయం తెలుసుకున్న హీరో టోవినో థామస్ షాక్ అయ్యాడు. అతడికి ఏం చేయాలో పాలుపోవడం లేదట. సినిమా ఇండస్ట్రీలో గొడవలు సహజమే కానీ.. ఇలా సినిమా మొత్తాన్ని సోషల్ మీడియాలో పెట్టేయడం ఎంత వరకు కరెక్ట్ అని సినీ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన వాళ్ల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఆ మూవీకి నిర్మాతగా వ్యవహరించింది థామసే కావడం వల్ల.. హీరో కమ్ ప్రొడ్యూసర్ అవడం వల్ల ఆ సినిమాను ఫేస్ బుక్ లో రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ నష్టపోయేది థామసే.
ఈ కాంట్రవర్సీ ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కాంట్రవర్సీపై థామస్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.