Telugu Movies : అత్యధిక సినిమాలు చేసిన ఆనాటి తరం హీరోలు ఎవరు?.. మరి వాళ్లే లేకుంటే ఈరోజు ఎలా ఉండేది..?
భారతదేశంలో సినిమాలు ప్రారంభించి నేటికీ 110 సంవత్సరాలు గడిచినవి. అయితే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసేవారు. కానీ అప్పట్లో ఈ సినిమాలనేవి లేవు. కేవలం స్టేజీలపై నాటకాలు వేస్తూ ప్రజలను మెప్పిస్తూ ఎంతో కొంత డబ్బు అనేది సమకూర్చుకునేవారు. కానీ ప్రస్తుతం ఒక సినిమా తీస్తే కొన్ని కోట్లు ఖర్చుపడంతో పాటు తిరిగి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని కోట్లనేవి వసూలు రాబోతున్నారు.

అయితే ఆనాటి తరంలో టాప్ హీరోలుగా నిలిచిన వారు కొంతమంది ఉన్నారు. కానీ వాళ్లలో టాప్ ఫైవ్ గా ఎవరిని ఎన్నుకోవచ్చు అంటే అందులో కూడా కొంతమంది ఉన్నారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ ఇలాంటి స్టార్ హీరోలు అప్పట్లో ఎన్నో ఘనతలను సాధించారు. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ లేకుండా మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండే వాళ్ళం కాదు. నిజానికి ఏ సాంకేతికతలేని ఆ రోజుల్లోనే ఆ ఐదుగురు హీరోలు ఎంతో కష్టపడి శ్రమను, ఓర్పును భరించి తెలుగు సినిమాని వేరే స్థాయిలోకి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఆ రోజుల్లోనే ఎటువంటి సాంకేతిక లేకుండా ఎన్నో సినిమాలు నటించారు. దాదాపుగా ఒక్కొక్కరు 100కు పైగానే సినిమాలు చేసి ఔరా అనిపించారు. ప్రతి ఒక్కరి నుంచి ఏదో క్రమశిక్షణ అనేది మనం ఇప్పటికీ నేర్చుకోవచ్చు. ఆనాటి కాలంలోనే నందమూరి తారక రామారావు ఎన్నో సినిమాల్లోని నటించి అందరికీ ఆప్యాయతగా అందరి మనసుల్లో నాటుకు పోయాడు. ఆ తర్వాత రాజకీయంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు మంచి చేశాడు. అయితే హీరో కృష్ణ ఆనాటి కాలంలో దాదాపుగా 300 పైగా సినిమాలు చేసిన మొదటి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతను టాలీవుడ్ లోనే 357 సినిమాల్లో నటించి ప్రథమ స్థానంలో నిలిచాడు.
ఆ తర్వాత నందమూరి తారక రామారావు 302 సినిమాలలో నటించి రెండో స్థానంలో నిలిచాడు. ఇక మూడో స్థానం గురించి చూస్తే అక్కినేని కుటుంబానికి పెద్దదిక్కుగా, అందగాడిగా అలాగే ఎందరో మహిళల్లో రారాజుగా నిలిచినటువంటి లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఇతను దాదాపుగా 255 సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకొని అందరి మనసులో నాటుకు పోయాడు. ఇక శోభన్ బాబు విషయానికి వస్తే 231 సినిమాల్లో నటించి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ శోభన్ బాబు కూడా కృష్ణతోపాటుగా పోటీ పడుతూ సినిమాల్లో రాణించి తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నాడు. ఇక ఐదవ స్థానంలో కృష్ణంరాజు నిలిచాడు. ఇక చిత్ర సీమలో అజాన్బాహుడిగా ఎదిగిన అతను 190 సినిమాలు చేశాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలిచాడు.
అయితే అంత మంది హీరోలానాటి తరంలో అలా సినిమా రంగాన్ని ముందుకు నడిపిస్తున్న సమయంలోనే కరెక్ట్ గా చిరంజీవి ఎంట్రీ ఇచ్చి కొత్త తరం నటనని పరిచయం చేసిన హీరోగా నిలిచాడు. చిరంజీవి మొత్తం ఇప్పటివరకు 150 పైగా సినిమాల్లో నటించాడు. తను కూడా ఈనాటి తరాన్ని ముందుకు తీసుకెళుతున్న వ్యక్తిగా చిరంజీవి నిలిచాడు. ఇక ఇక్కడి నుండి ప్రతి ఒక్కరు కూడా టాలీవుడ్ ని ఇనికి తిరిగి చూసుకోకుండా కేవలం 30 సినిమాల్లోని నటించి మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఏకంగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తీసుకెళ్లిన వ్యక్తిగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు.
నిజానికి ఇప్పుడు మనం అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఇతర దేశాల్లో కూడా మారి మ్రోగిపోతుంది. కాబట్టి ఇంతటి మంది దిగ్గజా హీరోలు ఆనాటి తరం నుండి పుట్టుకు వస్తూ ఇవాళ టాలీవుడ్ ఇండస్ట్రీని అందరూ గర్వించే విధంగా చేశారు. ఆనాటి తరం హీరోలు అయినటువంటి నందమూరి తారకరామారావు,ఘట్టమనేని కృష్ణ,అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలాంటి హీరోలు అందరూ 200 పైగా సినిమాలు చేసినట్టు ఈనాటి తరం హీరోలు చేయలేరు. దానికి కారణం ఏంటంటే అప్పట్లో లాగా సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేయలేరు ఈనాటి తరం.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ కథకు తగ్గట్టుగా ఒకటి రెండు సంవత్సరాలు సినిమా సమయానికి దాదాపుగా రెండు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి రిలీజ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతం అలా అన్ని సినిమాలు చేయడానికి వీలు కాదు. ఇలాగ ఎక్కువ సినిమాలు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఆనాటి తరానికి మాత్రమే దక్కుతుందని అందరూ అంటున్నారు.