Prabhas three movies postponed: ప్రభాస్ అభిమానులకు గుండె పగిలిపోయే న్యూస్ .. ఆ మూడు సినిమాలు వాయిదా పడినట్లే..
ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత. తెలుగు సినిమాలో కనిపించే ప్రముఖ భారతీయ నటుడు. ఇతను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులలో ఒకడు. ప్రభాస్ వర్షం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. వర్షం మూవీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన స్టార్ డమ్ ను గుర్తించింది. మరియు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ లో ప్రభాస్ ఉత్తమ యంగ్ పర్ఫార్మర్ ని కూడా గెలుచుకున్నాడు.
మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనికి తోడుగా మే నెలలోనే ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉండటంతో ఆ ప్రభావం కల్కి పై ఎక్కువగా పడే అవకాశం ఉండటంతో కల్కి మూవీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభాస్ కల్కి మూవీ తో పాటు ' రాజాసాబ్ ' చేయగా,ఈ మూవీ వచ్చే సంవత్సరం అంటే 2025లో సంక్రాంతికి రిలీజ్ కావటానికి ప్లాన్ చేశారు.
ప్రభాస్ కెరియర్ లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అతని 25వ మూవీ ' స్పిరిట్ '. కల్కి మూవీకి గుమ్మడికాయ కొట్టగానే అదే సంవత్సరంలో ప్రభాస్ స్పిరిట్ సెట్ లో అడుగు పెట్టాల్సి ఉంది. మే,జూన్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి అదే సంవత్సరంలో రిలీజ్ కి ప్రయత్నాలు చేస్తున్నారు..
అయితే కల్కిమూవీ పార్ట్ ఆలస్యం కావడంతో పాటు, స్పిరిట్ దర్శకుడు సందీప్ వంగా స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ చేయలేదని లేటెస్ట్ టాక్. 2024 కాకుండా 2025 లో షూటింగ్ కి వెళ్లబోతుంది స్పిరిట్. స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ ఇంకో ఐదు,ఆరు నెలలు పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్ 25వ మూవీకి ఎంతో ఆలస్యం తప్పేట్టుగా లేదు.
మొన్న కల్కి ఇప్పుడు స్పిరిట్ మూవీస్ అనుకున్న టైంలో రిలీజ్ అవ్వటానికి అవకాశం లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ అయినా ఆలస్యంగా వచ్చిన ఆల్ టైమ్ రికార్డులు కొట్టటం మాత్రం పక్క అని ఫిక్స్ అయిపోయి తన ఫ్యాన్స్ ఆశగానే ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ స్పిరిట్ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.
ప్రభాస్ కటౌట్ కి పోలీస్ యూనిఫాం వేస్తే నా సామిరంగా మామూలుగా ఉండదు మరి. అందులోనూ సందీప్ వంగా డైరెక్షన్ అంటే అర్జున్ రెడ్డి,యానిమల్ చిత్రాల కంటే మించి ఉండటంలో సందేహం లేదు. ఎందుకంటే ప్రభాస్ ని అగ్రిసివ్ రోల్ లో చూడాలని అతని ఫ్యాన్స్ కల. అలాంటి పాత్రలకు పెట్టింది పేరు సందీప్ వంగా.
ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపిస్తారో అనేదే ఆసక్తిగా మారింది. కల్కి,స్పిరిట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత రాజాసాబ్ మూవీ రిలీజ్ కానుంది. నిజానికి ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేయగా, ఈ మూవీ కూడా 2025 వేసవి సెలవులకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..