NTR : బాలీవుడ్ భామతో టాలీవుడ్ తారక్.. వైరల్ అవుతున్న వార్ 2 లీక్స్..
దీంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో వార్ 2 కూడా ఒకటని చెప్పాలి. ఇక ఈ సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మంచి మాస్ సాంగ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే హృతిక్ రోషన్ మరియు తారక్ ఇద్దరు కూడా బెస్ట్ డాన్సర్లు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వరల్డ్ క్లాసు మెస్మరైజింగ్ సాంగ్ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఆ పాట నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సిని వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యాష్ రాజు ఫిలిమ్ స్టూడియోలో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మధ్య జరిగే కొన్ని కీలకమైన సన్నివేశాలను మూవీ మేకర్ చిత్రీకరిస్తున్నారు.
ఈ క్రమంలోనే దాదాపు 10 రోజులు పాటు కీలక షెడ్యూల్ కొనసాగనుంది. దీనిలో భాగంగా ఇవాళ తారక్ ముంబై చేరుకున్నారు. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఫిట్నెస్ , ఎక్స్పర్ట్ తో దాదాపు రెండు వారాలపాటు ట్రైనింగ్ తీసుకొనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలో షెడ్యూల్ ముగిసిన తర్వాత హైదరాబాద్ చేరుకొని తారక్ దేవర సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.
ఊర్వశి తో జిమ్ లో సెల్ఫీ...
ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఊర్వసి రౌతేలా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దిగిన సెల్ఫీ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ఫోటో జిమ్ లో దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వీరిద్దరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సెల్ఫీ ని పోస్ట్ చేస్తూ ఊర్వసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే తారక్ పై ప్రశంసల వర్షం కురిపించారు. జూనియర్ ఎన్టీఆర్ మా ప్రియమైన నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్ అంటూ క్రమశిక్షణ , నిజాయితీ వినయంతో మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయమంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. భవిష్యత్తులో మీతో కలిసి నటించేందుకు ఒక అవకాశం దొరికితే నేను రెడీగా ఉన్నాను అంటూ తెలియజేశారు.
దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఊర్వశి రౌతేలా టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ 109వ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు బాబి కొల్లి దర్శకత్వం వహిస్తుండగా షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో ఊర్వశి ఫోటోలు జగడంతో వార్ 2 సినిమాలో ఈమె కూడా నటిస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.