Vijay Deverakonda – Rashmika Mandanna : మళ్లీ దొరికేశారు.. దుబాయ్‌కి చెక్కేసిన విజయ్, రష్మిక.. ఇదిగో ప్రూఫ్
Vijay Deverakonda – Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇద్దరూ జంటగా నటించిన గీత గోవిందం సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు కదా.
కానీ.. వీళ్ల రిలేషన్ షిప్ పై ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరు కూడా నోరు విప్పలేదు. ఈ జంట క్లారిటీ ఇవ్వకున్నా.. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా ట్రిప్ కు వెళ్తు మాత్రం అడ్డంగా దొరికిపోతున్నారు.
Vijay Deverakonda – Rashmika Mandanna : ఇద్దరూ దుబాయ్ లోనే ఉన్నారా?
విజయ్ మాత్రమే కాదు.. రష్మిక మందన్నా కూడా ప్రస్తుతం దుబాయ్ లోనే ఉందట. అలా ఎలా అంటారా? రష్మిక ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టింది. నెమలి ఫోటోను షేర్ చేసింది రష్మిక. బ్యూటిఫుల్ అంటూ రష్మిక ఇన్ స్టా స్టోరీ పెట్టింది. కట్ చేస్తే.. కొంత సేపటికే విజయ్ దేవరకొండ కూడా ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ లో ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి చెప్పాడు విజయ్.
అయితే.. విజయ్ కూర్చొని ఉన్న బ్యాక్ గ్రౌండ్ చూస్తే అందులో రష్మిక పోస్ట్ చేసిన స్టోరీలో ఉన్న నెమలీనే కనిపించింది. అదే నెమలి కావడంతో.. ఇద్దరూ ఒకే చోట ఉన్నారని.. ఇద్దరూ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారని అర్థం అవుతోంది. ఇంకేం ఉంది.. ఫ్యాన్స్ ఆగుతారా? రష్మిక, విజయ్ ఇద్దరూ దుబాయ్ లో అడ్డంగా దొరికిపోయారు. ఇదిగో ప్రూఫ్స్.. అంటూ నెమలి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మరోవైపు రష్మిక పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 5నే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్స్ పక్కన పెట్టి మరీ, ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ ఉన్నా కూడా రష్మిక బర్త్ డే వేడుకల కోసం విజయ్ దుబాయ్ వెళ్లడంతో రష్మిక, విజయ్ మధ్య రిలేషన్ షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక.. ది ఫ్యామిలీ స్టార్ మూవీ.. రష్మిక కూడా నటించిందని చెబుతున్నారు. తను గెస్ట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తన రోల్ పై మూవీ యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు కానీ.. వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ మాత్రం రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు కూడా తమ అభిమానులకు ఎక్కడో ఒక చోట అడ్డంగా దొరికేస్తున్నారు. బుక్ అయిపోతున్నారు.