ఉత్తమ నటి వివాదంలో సావిత్రి, భానుమతి మధ్య ఏం జరిగింది..?

 ఉత్తమ నటి వివాదంలో సావిత్రి, భానుమతి మధ్య ఏం జరిగింది..?

 మన తెలుగు సిని పరిశ్రమలో సావిత్రి అంటే తెలియని వారు లేరు. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినీ ప్రపంచానికి ఒకే ఒక మహానటి సావిత్రి. దక్షిణాది భాషలలో కూడా వెండితెరపై  వెన్నెలను కురిపించింది. తెలుగు సినీ ప్రపంచంలో మహానటి కొమ్మిరెడ్డి సావిత్రి గారు ఎందరో మనుషులను, హృదయాలను తన నటనతో ఆకట్టుకుంది. సావిత్రిని, సావిత్రి గణేషన్ అని కూడా అంటారు. ఆమె భారతదేశానికి చెందిన నటి మాత్రమే కాదు ఆమె ప్లే బ్యాక్ సింగర్, నర్తకి, దర్శకురాలు మరియు నిర్మాతగా కూడా ఆమె వర్క్ చేశారు. ఆమె ఎంతో మందికి సహాయం చేసింది. అందుకే ఇప్పటికి కూడా ఆమె పేరు ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అప్పట్లో సినిమాల మధ్య ఎంతో పోటీ ఉండేది. సినిమాలు సక్సెస్ అయిన తర్వాత అవార్డుల విషయంలో కూడా అంతకంటే ఎక్కువ పోటీ ఉండేది. ప్రత్యేకంగా చెప్పాలంటే.. అభిమానులు తమ హీరోకి ఈ అవార్డు రావడం ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకునేవారు. ఎందుకు అనగా అందరి హీరోలను బీట్ చేసి మా హీరోకి అవార్డు వచ్చిందంటే హీరోల ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది అని భావిస్తారు. అవార్డుల కోసం మన హీరో లాగే హీరో అభిమానులు కూడా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు..

 ఇక అవార్డుల విషయంలో గొడవలు జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా నేషనల్ తెలుగు అవార్డు వచ్చిన వాళ్ళల్లో అల్లు అర్జున్ ఒకరు. కొంతమంది హీరోలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా సినిమా లాంగ్వేజెస్ లోని హీరోలు కూడా అసంతృప్తి తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లోనూ అవార్డుల విషయంలో చాలా గొడవలు జరుగుతూనే ఉంటాయి.1950 లో మద్రాస్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ పేరుతో మద్రాస్ లో ఒక సంఘమే ఉంది. దీని తరుపున ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రదానం చేస్తూనే ఉంటారు. 1953 సంవత్సరంలో తెలుగు దేవదాసు మూవీ సూపర్ హిట్ కావటం వలన ఉత్తమ నటుడిగా నాగేశ్వరరావుకి ఈ అవార్డు అందజేశారు. ఇక ఉత్తమ నటిగా చండీరాణి సినిమా కోసం భానుమతిని ఎంపిక చేశారు. అంతేకాక సావిత్రిని కూడా దేవదాస్ సినిమా కోసం ఉత్తమ నటిగా ఎంచుకున్నారు. ఇలా ఇద్దరు హీరోయిన్లను అవార్డులకు అనౌన్స్ చేశారు. ఈ రెండు మూవీస్ తెలుగు,తమిళం రెండు నిర్మాణాలు జరుపుకున్నాయి. ఇలాంటి విషయంలో ఒక సినిమాకి అవార్డు ఇస్తే రెండు భాషల్లో ఆ సినిమాకే అవార్డు ఇవ్వాలి. అలా కాకుండా సావిత్రికి దేవదాస్ మూవీ కోసం తమిళంలో ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వటం ఏంటి అని కొందరు ప్రశ్నించారు.

 చండీరాణి మూవీ కోసం తెలుగులో భానుమతికి ఉత్తమ అవార్డు ఇవ్వటం కూడా న్యాయం కాదు. ఇస్తే రెండు భాషలకు కలిపి ఒక్క మూవీకె అవార్డు ఇవ్వాలని కోరారు. తమిళంలో వచ్చిన దేవదాస్ మూవీ లో సావిత్రి బాగా నటించింది కానీ తెలుగులొ వచ్చిన దేవదాసులో బాగా చేయలేదు అనే విషయం మీద అప్పట్లో ఒక పెద్ద రచ్చ జరిగింది. ఇది ఇలా ఉండగా ఉత్తమ నటి అవార్డును తీసుకోవడానికి సావిత్రి గారు దేవదాస్ మూవీ నుంచి ఆమెను ఎంపిక చేయగా సావిత్రి గారు వచ్చి ఈ అవార్డును అందుకున్నారు. భానుమతి గారు మాత్రం చండీరాణి సినిమా కోసం ఉత్తమ నటిగా ఎంపిక చేసిన ఆమె ఈవెంట్ కి రాకపోవడం పెద్ద విశేషం. ఈ అవార్డుల గురించి ఎంతోమంది నటీనటుల మధ్య గొడవలు జరిగాయి. ఈ విధంగా సావిత్రి,  భానుమతిల మధ్య అవార్డు గురించి వివాదాలు తలెత్తాయి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా నటీనటుల మధ్య ఈ అవార్డుల గురించి ఎన్నో వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?