SS Rajamouli : ఆర్ఆర్ఆర్ మూవీలో హీరోయిన్ చనిపోవాలని కథ రాసుకున్న రాజమౌళి.. ఆ తర్వాత ఎందుకు స్టోరీ మార్చారంటే?
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ సినిమాతో పోల్చితే ముందు ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేయాలని డైరెక్టర్ రాజమౌళి భావించారట. తర్వాత ఎందుకో ఆ స్టోరీ వద్దని.. చివరకు స్టోరీని మార్చేశారట. ఈ విషయాలన్నీ డైరెక్టర్ జక్కన్ననే స్వయంగా చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో జెన్నీ పాత్ర చాలా కీలకం. బ్రిటీష్ యువరాణి పాత్ర జెన్నీగా ఓలివియా మోరిస్ నటించింది. ఎన్టీఆర్ కు ఆమె జోడిగా నటించింది. వీళ్లిద్దరి మధ్య చాలా సన్నివేశాలను చిత్రీకరించారట. కానీ.. అప్పటికే సినిమా మూడు గంటలు దాటడంతో కొన్ని తీసేసినట్టు రాజమౌళి చెప్పారు.
జెన్నీని ఉపయోగించుకొని మల్లి ఎక్కడుందో తెలుసుకుంటాడు భీమ్. కానీ.. ఆ తర్వాత స్టోరీ వేరే ఉంటుంది. భీమ్ ను జైలులో పెట్టిన తర్వాత ఆ విషయం జెన్నీకి తెలిసి అతడిని కలవడం కోసం వెళ్తుంది. ఎలాగైనా భీమ్ ను జైలు నుంచి తప్పించడం కోసం జైలు నుంచి తప్పించుకునే ప్లాన్స్ ను తీసుకెళ్లి భీమ్ కు ఇస్తుంది జెన్నీ. భీమ్ ను కలిసి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. గవర్నర్ స్కాట్ భార్య చూసి ఏమైందని అడుగుతుంది. ఇంతలో భీమ్ తప్పించుకొని పారిపోతాడు.
కట్ చేస్తే భీమ్ తప్పించుకొని పారిపోయాడని.. రామ్ గురించి అసలు విషయం తెలిసి రామ్ ను జైలులో పెడతారు బ్రిటీష్ పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న భీమ్.. తిరిగి జైలుకు వస్తాడు. రామ్ ను కాపాడి జైలు నుంచి బయటికి తీసుకెళ్తాడు.
అయితే.. బ్రిటీష్ సైన్యాన్ని చంపుకుంటూ ఇద్దరూ అడవిలోకి వెళ్తారు. అయితే.. వీళ్లిద్దరినీ పట్టుకోవడం కోసం జెన్నీని పావుగా వాడుకొని వాళ్లను పట్టుకోవాలని స్కాట్ అనుకుంటాడు. వాళ్లను వెంటనే లొంగిపోవాలని.. లేకపోతే జెన్నీని చంపేస్తానని స్కాట్.. ఇద్దరు భీమ్, రామ్ ను బెదిరిస్తాడు. దీంతో జెన్నీ కోసం ఇద్దరూ లొంగిపోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. స్కాట్ మాత్రం భీమ్ తప్పించుకోవడానికి జెన్నీ సాయం చేసిందన్న కోపంతో జెన్నీని స్కాట్ చంపేస్తాడు.
ఇది అసలు కథ. కానీ.. ఇది చివరకు విషాదంతో ముగుస్తుంది అని ఆలోచించిన రాజమౌళి.. కథను మొత్తం మార్చేశారట. అందుకే జెన్నీని చంపకుండా వదిలేశారు.. అంటూ రాజమౌళి జపాన్ లో ఈ సినిమా కథలోని మార్పులను షేర్ చేసుకున్నారు.
ఇక.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తన తదుపరి సినిమాను తీస్తున్నారు. ఈ మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగుతుంది. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ.. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీ కోసం మహేశ్ కూడా రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.