Holi celebrations injured : హోలీ వేడుకల్లో మహిళ ప్రాణాల మీదకు తెచ్చిన కోడిగుడ్డు..
అయితే ఒకప్పుడు పకృతిలో దొరికే పూలు, ఆకులతో రంగులను తయారు చేసుకొని వాటితో హోలీ ఆడుకునే వాళ్ళు. ఈ రోజుల్లో అలా తయారు చేసే వాళ్ళు చాలా వరకు తగ్గారు. ఇప్పుడు రెడీమేడ్ రంగులతోనే సంబరాలు చేసుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ఇంజన్ ఆయిల్ లేదా పేడ, కోడిగుడ్డు, నీళ్లు, టమాటలు ఇలా పిచ్చి పలు రకాలు అన్నట్టుగా రకరకాలుగా హోలీ సంబరాలు చేసుకుంటారు.
కుమారుడు పై జరుగుతున్న దాడిని అడ్డుకోవటానికి రమా దగ్గరకు వెళ్ళగా,పక్కనే ఉన్న కొడవలి తీసుకొని ప్రకాష్ ఆమెపై దాడి చేశాడు.రమా మెడపై వేటుపడటం వల్ల తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు.రక్తస్రావం ఎక్కువగా జరగటం వల్ల ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.ఈ సంఘటన పై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు..
నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా హోలీ పండగ పూట ఒక ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.గోపాల్ పేట వీధిలో ఉన్న వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా కూలి కింద పడటంతో అక్కడే ఉన్న ఒక చిన్నారిపై సకలాలు పడటంతో ఆ బాలిక మృతి చెందింది. అంతేకాక మరో ఇద్దరి పిల్లలకు గాయాలు కూడా అయ్యాయి.
గోపాల్ పేట వీధిలో ప్రతిసారి చేసినట్లుగానే కామ దహనం చేస్తుండగా ఆ మంటలకు వేడెక్కిన వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా కూలిపోవడంతో అదే టైం లో చిన్నారులు హోలీ ఆడుకుంటూ వాటర్ ట్యాంకర్ దగ్గరికి వచ్చేసరికి పిల్లలపై సకలాలు పడటంవల్ల లక్ష్మీ ప్రణతి అనే ఒక బాలిక మృతి చెందగా.మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు..