Nawazuddin siddiqui: వాచ్ మెన్ గా చేస్తూ కోతిమీర కూడా అమ్మాడు .. కట్ చేస్తే.. ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్...

Nawazuddin siddiqui: వాచ్ మెన్ గా చేస్తూ కోతిమీర కూడా అమ్మాడు .. కట్ చేస్తే.. ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్...

Nawazuddin siddiqui: సినీ పరిశ్రమలో కొందరికి సక్సెస్ త్వరగా వస్తే మరి కొందరికి మాత్రం తన టాలెంట్ ని చూపించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ ని సాధిస్తారు. ఇలాంటివారు సినీ పరిశ్రమపై గట్టి ప్రభావం చూపుతారు. ఈ కోవకు చెందిన వ్యక్తి ఇప్పుడు దేశం మొత్తానికి తెలుసు.ఒకప్పుడు ఆయన వాచ్మెన్ గా,కెమిస్ట్రీ గా పని చేశాడు. మూవీస్ లో చేయాలని ఆశ గా ఉంది అని చెప్తే అందరూ వెక్కిరించేవాళ్లంట. ఇప్పుడు ఆయన బాలీవుడ్ లో బాగా బిజీగా ఉండే నటులల్లో ఆయన ఒకరు. ఆయన ఎవరో కాదు 'సైందవ్ 'విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖి. ఈయన బాలీవుడ్ లో తన నటనతో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. వెంకటేష్ హీరోగా నటించిన సినిమాలో 'సైందర్ 'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ  ఇచ్చాడు. తన పాత్రకు సొంతగా డబ్బింగ్ చెప్పుకోవటమే కాక విలన్ గా ప్రజలను ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ లో తన నటనతో గుర్తింపు పొందటానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఆయనకు ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ నటనను వదిలేయలేదు. ఆయన సక్సెస్ కి అంకిత భావమే కారణమని చెప్పొచ్చు..

ఆయన ఉత్తరప్రదేశ్ లోని బుధన ప్రాంతంలో జన్మించగా తనతో జన్మించిన 8 మందిలో ఆయనే పెద్దవాడు. ఆయన ఎక్కువ కాలా ఉత్తరాఖండ్ లొ గడిపాడు. ఆయన బిఎస్సి, కెమిస్ట్రీ చేసిన తర్వాత తన కుటుంబాన్ని పోషించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కెమిస్ట్ గా పని చేశాడు. అతనికి యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం ఉండటంతో ఒక సంవత్సరం తర్వాత తన డ్రీమ్ చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. ఢిల్లీలో గల నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలొ జాయిన్ అయ్యాడు. ఒకప్పుడు ఆయన వాచ్మెన్ గా పనిచేసి కొత్తిమీర కూడా అమ్మిన అని చెప్పారు. ఢిల్లీకి వచ్చిన  తర్వాత తన యాక్టింగ్ పై దృష్టి పెట్టాడు. ఆయన ఉద్యోగం మానేయడంతో చేతులు డబ్బులు అయిపోగా ఆయన పరిస్థితి దిగజారింది. ఆయన దగ్గర డబ్బులు లేకపోవటంతో స్నేహితులు దగ్గర డబ్బు తీసుకొని రెండు రోజుల్లో వస్తానని చెప్పేవాడిని తర్వాత ఇంకొకల దగ్గర డబ్బు తీసుకొని ముందు తీసుకున్న వాళ్ళకి ఇచ్చేవాన్ని ఇలా డబ్బు అవసరమైనప్పుడల్లా ఇలాగే చేసే వాడిని అని చెప్పారు. ఆయన డబ్బు కోసం వాచ్మెన్ గా పనిచేసి కొత్తిమీర కూడా అమ్మిన అని చెప్పాడు. అప్పట్లో  చిన్న ప్లాట్ లో నలుగురితో కలిసి ఉండేవాడు.

 తన సినీ కెరీర్లో 1999లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన సర్ఫారోస్ మూవీలో చిన్న పాత్రతో బాలీవుడ్ లొ అడుగు పెట్టాడు. తర్వాత ముంబై కి వచ్చి టెలివిజన్ సిరీస్ లో పనిచేయాలని ప్రయత్నించగా అది పెద్దగా సక్సెస్ కాలేదు. 2000 లో వచ్చిన రామ్ గోపాల్ వర్మ సినిమా షూల్, జంగిల్ అలాగే రాజకుమార్ హీరాని తీసిన మున్నాభాయ్ MBBSలో ఈయన కనిపించాడు. ఈయన 2005 వరకు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రయత్నాలు చేయటం మాత్రం ఆపలేదు. 'కహాని 'మూవీలో సిద్ధి కనిపించగా ఆర్కిటిపల్ షార్ట్ టెంపర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కాన్ గా నటించాడు. ఇలా ఇండస్ట్రీకి వచ్చిన 12 సంవత్సరాల తర్వాత ఆయనకు మంచి గుర్తింపు దక్కింది. సిద్ధి తర్వాత వెనుక తిరిగి చూసుకోలేదు. ఇండస్ట్రీలో ఎక్కువగా బిజీగా ఉండే వాళ్లలో ఈయన ఒకడుగా మారాడు. టాప్ఓటిటి   యాక్టర్ గా ఎంతో గుర్తింపు పొందాడు. ఈయన మూవీ లవర్స్ అందరికీ అంతగానో పరిచయమయ్యాడు. సిద్ధిఖి ఇప్పుడు ప్రతి సినిమాకి 10 కోట్లు తీసుకుంటాడు.2 024 నాటికి నవాజుద్దీన్ సిద్ధిఖి సంపాదన 15 మిలియన్లు. అంటే 125 కోట్ల అన్నమాట..

 

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?