medipally : కల్తీ మిక్సర్, బూందీ తయారీ కేంద్రంపై దాడి
అధికారుల సోదాల్లో 300 ప్యాకెట్లు మిక్సర్, 200 కిలోల బూందీ, 20 కిలోల పచ్చి బఠానీ, 50 కిలోల దాల్‌మోటి, 15 కిలోల పెసర, 20 కేజీలు మసాల పల్లీలు, 20 కిలోల గుర్రపు పప్పు, 5 కిలోల రాక్ సాల్ట్, 250 గ్రాముల గ్రీన్ కలర్ వంటి తయారీ పదార్థాలను గుర్తించారు. కల్తీ మిక్సర్ తయారీ నిందితుడు ఉప్పల్ చెందిన ఆంటోని అరుల్ శీలన్ పట్టురాజ్ అలియాస్ పట్టురాజ్ (57) ను అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా సులభంగా డబ్బులు సంపాదించేందుకు అక్రమంగా వ్యాపారాన్ని ప్రారంభించి కల్తీ ఉత్పత్తులను దుకాణాలు, బేకరీలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ ఆర్ గోవిందరెడ్డి తెలిపారు. ఎవరైనా ఇలాంటి కల్తీ మిక్సర్ లాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.