Bus Accident : అర్ధరాత్రి ఘోర ప్రమాదం... బ్రిడ్జి నుంచి కిందపడిన బస్సు.. ఐదుగురు మృతి

Bus Accident : అర్ధరాత్రి ఘోర ప్రమాదం... బ్రిడ్జి నుంచి కిందపడిన బస్సు.. ఐదుగురు మృతి

Bus Accident : ఒడిశా రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఓ బస్సు ఫ్లైఓవర్ నుంచి కిందపడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన ఒడిషాలోని జాజ్ పూర్ లో చోటు చేసుకుంది. 

పూరీ నుంచి వెళ్తున్న బస్సు.. వెస్ట్ బెంగాల్ వైపు వెళ్తోందని.. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. బస్సులో 42 నుంచి 43 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. పూరీ నుంచి బస్సు వెస్ట్ బెంగాల్ వైపు వెళ్తోంది.. అని జాజ్ పూర్ ఎస్పీ వినిత్ అగర్వాల్ అన్నారు. 

క్షతగాత్రులను వెంటనే కటక్ లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీకి తరలించాం. ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు అని వినిత్ చెప్పారు. ఈ ఘటనలో 38 మందికి గాయాలయ్యాయని.. వాళ్లందరికీ సరైన వైద్యం అందిస్తున్నామని, అందులో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్(సీడీఎంవో) షిబాసిష్ మోహరానా తెలిపారు.

160 -2

Bus Accident : కోల్ కతాకు చెందిన బస్సుగా గుర్తింపు

ప్రమాదానికి గురైన బస్సు కోల్ కతాకు చెందిన బస్సుగా గుర్తించారు. పూరీ నుంచి బస్సు కోల్ కతా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ మీది నుంచి బస్సు వెళ్తుండగా అదుపు తప్పి కింద పడింది. ఈ ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒడిషా ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 

నేషనల్ హైవే 16 పై బారాబతి బ్రిడ్జి మీదికి రాత్రి బస్సు చేరుకుంది. ఇంతలో బస్సు ఆదుపు తప్పి బారాబతి బ్రిడ్జి మీది నుంచి కింద పడటంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. బస్సు డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బస్సు ముందు భాగంలో కూర్చొన్న వాళ్లకే ఎక్కువ గాయాలు అయినట్టు తెలుస్తోంది.

160 -3

వాళ్లలోనే ఎక్కువ మంది చనిపోయారు. వెనుక భాగంలో కూర్చొన్న వాళ్లు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. అయితే.. బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని.. అందుకే అదుపు తప్పి బస్సు ఫ్లైఓవర్ నుంచి కింద పడిందని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

మేము అప్పుడు బస్టాండ్ వద్ద ఉన్నాం. ఇంతలో ఓ బస్సు చాలా వేగంగా రావడం చూశాం. ఆ బస్సు డ్రైవర్.. బస్సును ఇష్టం ఉన్నట్టుగా నడుపుతున్నాడు. అంతలోనే బస్సు ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉంటాడు అని ఓ స్థానికుడు తెలిపాడు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?