Lasya Nandita : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

10 రోజుల్లో రెండు ప్ర‌మాదాలు త‌ప్పించుకున్నా వెంటాడిన మృత్యువు

Lasya Nandita : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి


 Lasya Nandita : హైద‌రాబాద్‌, క్విక్ టుడే :  కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. గురువారం రాత్రి ఆమె స‌దాశివ‌పేట‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. శుక్ర‌వారం ఉద‌యం ఆమె వ‌స్తున్న కారు ఓఆర్ ఆర్ పై రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ముందుగా వెళ్తున్న వాహ‌నాన్ని త‌ప్పించే క్ర‌మంలో డివైడ‌ర్ రేయిలింగ్‌ను కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్క‌డికక్క‌డే మృతి చెందారు. ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాశ్ కారు న‌డుపుతున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న‌కు కూడా తీవ్ర గాయాలు కాగా అత‌డిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కారు అతివేగంగా ప్ర‌యాణించ‌డ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మైంద‌ని పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో పేర్కొన్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోలేద‌ని స‌మాచారం.  ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై ఇంకా స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ రాలేదు. పోలీసులు ప్ర‌మాద ఘ‌ట‌నపై విచార‌ణ జ‌రుపుతున్నారు. పూర్త స‌మాచారం తెలియాల్సి ఉంది. 

233

ఎమ్మెల్యే లాస్య నందిత మృత‌దేహాన్ని ప‌టాన్‌చెరులోని అమెదా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డి నుంచి మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  లాస్య నందిత మృతి చెందిన వార్త తెలియ‌గానే సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు హుటాహుటిన ఆస్ప‌త్రికి చేరుకున్నారు. ప‌ది రోజుల్లోనే ఆమె రెండు ప్ర‌మాదాల నుంచి త‌ప్పించుకున్నారు. ఓవ‌ర్ లోడ్ కార‌ణంగా లిఫ్ట్ ప్ర‌మాదం త‌ప్పింది. ఈ నెల 13న న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌రిగిన కేసీఆర్ బహిరంగ స‌భ‌కు వెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నా మ‌ర‌ణం నుంచి ఆమె త‌ప్పించుకోలేక‌పోయారు. లాస్య నందిత మ‌ర‌ణం ప‌ట్ల మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విషాదం వ్య‌క్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత తండ్రి సాయ‌న్న ఇటీవలే మృతి చెందిన విష‌యం తెలిసిందే.. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?