Soundarya: ఆ సినిమాలో సౌందర్యని కాదని రంభను తీసుకున్న చిరంజీవి.. ఎందుకో తెలుసా..?
ఆయన అతి తక్కువ కాలంలోనే మంచి నటుడుగా అలాగే మంచి డాన్సర్ గా అందరిని ఆకట్టుకున్నాడు. చిరంజీవి మొదటి విజయం ఖైదీ సినిమాతో తెలుగు ప్రజలకు హీరోగా పరిచయమయ్యాడు. సినీ పరిశ్రమలో చిరంజీవి స్థాయి వేరు. సినిమా రంగానికి ఈయన ఒక లెజెండ్. చిరంజీవి తన తెలుగు ప్రజలందరికీ చేత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అని పిలిపించుకున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు తర్వాత ఈ జనరేషన్ కు వచ్చిన చిరంజీవి హీరోగా ఎదగడమే కాకుండా మెగాస్టార్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సీనియర్లు వేసిన బాటలో నడుస్తూ జూనియర్ లని ఎంకరేజ్ చేస్తూ చిరంజీవి సినీ పరిశ్రమలో ఎదిగిన విధానం చాలా అద్వితీయమనే చెప్పాలి.
దాంతో ఈ మూవీలో కూడా ఒక కొత్త హీరోయిన్ ని పరిచయం చేయాలి అనుకున్నాడు. ఈ విషయం గురించి చిరంజీవి కూడా చెప్పారు. ఇంకా దాంతో చిరంజీవి (Chiranjeevi) ఫస్ట్ సౌందర్య (Soundarya)ని ఫిక్స్ అయిన డైరెక్టర్ గారు చెప్పటంతో హీరోయిన్ని సెలెక్ట్ చేసే విషయంలో డైరెక్టర్ కి అప్పగించాడు. చాలామంది హీరోయిన్లు చూసినప్పటికీ ఆ క్యారెక్టర్ కి తగ్గ హీరోయిన్ డైరెక్టర్ కి దొరకలేదు. చిరంజీవితో ' హిట్లర్ ' సినిమాలో హీరోయిన్ గా నటించిన రంభ ని హీరోయిన్ గా తననే తీసుకుందామని డైరెక్టర్ చెప్పారు.
చిరంజీవి కూడా ఈ విషయంలో ఓకే చెప్పేసరికి రంభనే హీరోయిన్ గా పిక్స్ చేశారు. ఇక సౌందర్య (Soundarya)ని పక్కన పెట్టటానికి ఇది ఒక కారణం అయితే మరొక కారణం ఏంటి అంటే అప్పుడే చిరంజీవి (Chiranjeevi) గుణశేఖర్ దర్శకత్వంలో 'చూడాలని ఉంది' అనే మూవీ షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటున్నాడు.
ఈ మూవీలో హీరోయిన్ సౌందర్య (Soundarya) కావటం వల్ల రెండు సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి ఈ రెండు మూవీలో సౌందర్య ఎందుకు అనే కారణం చేత చిరంజీవి సౌందర్యను పక్కన పెట్టినట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఇక మొత్తానికి 'బావగారు బాగున్నారా' సినిమాలో చిరంజీవి (Chiranjeevi), రంభ ల జోడి మరొకసారి ప్రేక్షకులను అలరించిందని చెప్పవచ్చు.
ఈ మూవీ అనేది కుటుంబ ఆధారిత చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి (Chiranjeevi), రంభ ప్రధాన పాత్రలో పోషించారు. అందులో విలన్ గా మాత్రం శ్రీహరి, కోట శ్రీనివాసరావు నటించారు. శ్రీహరి ఒక హీరో అయినప్పటికీ ఆయన విలన్ గా కూడా కొన్ని సినిమాలు చేశాడు. హీరోగా ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో విలన్ గా అంతే క్రేజ్ సాధించాడు.
ఈ చిత్రం భారతీయ తెలుగు భాష రొమాంటిక్ కామెడీ చిత్రం. సరదాగా సాగే ప్రేమ కథ తో పాటు ఈ తెలుగు సినిమా విజయానికి బావగారు బాగున్నారా తారాగణం ప్రధాన కారణం. ఈ మూవీలో రంభ తన నటనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ మూవీలో ఇంకా బ్రహ్మానందం, రచన బెనర్జీ, పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు మరిచిపోలేని ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం అని చెప్పవచ్చు..