ఎట్ట‌కేల‌కు టీఎంసీ నేత షాజహాన్ అరెస్ట్.. 10 రోజుల పోలీస్ కస్టడీ 

ఎట్ట‌కేల‌కు టీఎంసీ నేత షాజహాన్ అరెస్ట్.. 10 రోజుల పోలీస్ కస్టడీ 

కోల్‌క‌తా : ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో భూదందా, లైంగిక దాడులు వంటి ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజ‌హాన్ షేక్‌ను ఎట్ట‌కేల‌కు పోలీసులు అరెస్టు చేశారు. అత‌ని ఆగ‌డాల‌పై స్థానిక మ‌హిళ‌లు చేప‌ట్టిన ఆందోళ‌న‌లు తీవ్ర‌రూపం దాల్చి హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు దారితీసిన విష‌యం తెలిసిందే. అధికార టీఎంసీ, ప్ర‌తిప‌క్ష బీజేపీ పార్టీల మ‌ధ్య  మాట‌ల యుద్ధం కొన‌సాగింది. నార్త్ 24 పరగణాల జిల్లా మినాఖాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బమన్పుకూర్ లోని ఓ ఇంట్లో ఉన్న షాజహాన్ ను గురువారం  అదుపులోకి తీసుకున్నట్లు ప‌శ్చిమ‌బెంగాల్ అదనపు డీజీపీ సుప్రతీమ్ సర్కార్ తెలిపారు. మ‌రికొంత మందితో క‌లిసి 55 రోజుల నుంచి ఆ ఇంట్లో దాక్కున్న అత‌డిని అరెస్టు చేశామ‌ని తెలిపారు.

బసీర్హాత్ కోర్టు అతడిని 10 రోజుల పోలీస్ కస్టడీకి పంపించిందని వెల్ల‌డించారు. కేవలం రెండు నిమిషాల్లోనే విచారణ ముగియ‌డంతో ఆ వెంటనే అత‌డిని కోల్‌క‌తాలోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. సీబీఐ అక్కడే అతడిపై విచార‌ణలో భాగంగా ప్ర‌శ్నిస్తుంద‌ని ఏడీజీపీ సర్కార్ చెప్పారు. జనవరి 5వ తేదీన షాజహాన్ షేక్ ఇంటికి రేషన్ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధి కారులపై దాదాపు వెయ్యి మంది మద్దతు దారులు దాడికి దిగారు. ఈ ఘ‌ట‌న‌పై నజాత్ పోలీస్ స్టేషన్లో రెం డు కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

అప్ప‌టి నుంచి ఆయ‌న షాజహాన్ కనిపించకుండా త‌ప్పించుకు తిరుగుతున్నాడు. దశాబ్దకాలంగా సందేశ్ఖలీ ప్రాంతంలో షాజహాన్ తిరుగులేని నేతగా చెలామణీ అవుతున్నాడు. షాజహాన్, అతడి అనుచరు లపై భూ దందా, గ్యాంగ్ రేప్ వంటి ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఆరోప ణలపై 100కు పైగా కేసులు కూడా న‌మోద‌య్య‌యి. షాజాహాన్‌ను పోలీసులు అరెస్టు చేసిన నేప‌థ్యంలో షాజాహాన్‌ను పార్టీ నుంచి ఆరేండ్ల పాటు బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు అధికార టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియాన్ మీడియాతో ప్రక టించారు.  నార్త్ 24 పరగణాల జిల్లా పరిషత్ టీఎంసీ సభ్యుడిగా, సందేశ్ఖలీ అసెంబ్లీ నియోజక వర్గం పార్టీ కన్వీనర్ గా షాజాహాన్ పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?