Drugs : మ‌త్తు మ‌హ‌మ్మారిని చిత్తు చేసేదెలా..?

Drugs : మ‌త్తు మ‌హ‌మ్మారిని చిత్తు చేసేదెలా..?

Drugs : భార‌త్‌లో మాద‌క‌ద్ర‌వ్యాల విష‌యంలో భారీగా కేసులు న‌మోద‌వుతున్నాయి. వేల కిలోల గంజాయిని పోలీసులు త‌గుల‌బెడుతూనే ఉన్నారు. భారీ మొత్తంలో డ్ర‌గ్స్ తో ప‌ట్టుబడుతున్న కేసులు న‌మోదవుతున్నాయి. అయినా ముఖ్యంగా యువ‌త మాదకద్రవ్యాల మత్తులో పడి ప్రాణాలమీదకు ఎందుకు తెచ్చుకుంటున్నారు. అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), మత్తుపదార్థాలు అలవాటైనవారిపై సర్వే నిర్వహించింది. ఈ స‌ర్వే ప్ర‌కారం దేశంలో 2004లో ప్రతి 300 మంది ఇద్ద‌రు మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌లు కాగా అది 2018 నాటికి ప్ర‌తి 100 మందిలో న‌లుగురు ఉన్న‌ట్లు తెలిపింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టివ‌ర‌కు స‌ర్వే నిర్వ‌హించ‌లేదు. ఒక‌వేళ తాజాగా స‌ర్వే నిర్వ‌హించి ఉంటే ఆ లెక్క‌ల‌ను చూసి ప్ర‌భుత్వం షాక్ గురికావొస్తొందేమో.. అందుకేనేమో ఇంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని నిపుణుల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. 

వాస్తవానికి మన జీవితంలో మనకు తెలియకుండానే మత్తుపదార్థాలు అనేక రూపాల్లో వినియోగిస్తాం.  ఉదాహరణకు నొప్పి నివారణ కోసం మ‌నం హెరాయిన్ ఇంజెక్ష‌న్ తీసుకుంటాం. హెరాయిన్ తయారీకి   ఓపియం మొక్క మూలాధారం. ఈ ఓపీయం నుంచే నొప్పి నివారణ మందులు త‌యార‌వుతున్నాయి. ఈ మందుల వాడ‌కం ఎక్కువ‌గా ఉండే వారు హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాల వైపు మ‌ళ్లిన‌ట్లు ప్ర‌పంచ నివేదిక‌లు తెలుపుతున్నాయి. మాదకద్రవ్యాలు తీసుకోవడం త‌ప్పు అని తెలిసినా..  ఎప్పుడో ఒక తప్పటడుగు వేయ‌డం లేదా ఆస్పత్రిలో ఇచ్చిన ఔషధాలకు అలవాటుపడి క్రమంగా మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోయిన వారు ఉన్నార‌న‌డంలో నిజం ఉంది. వీరిని చట్టప్రకారం శిక్షార్హులను చేయడం ఏమాత్రం త‌గ‌దు. 

భారత్ లో మాదకద్రవ్యాల విస్త‌ర‌ణ‌ యువతను చాపకింద నీరులా నిర్వీర్యం చేస్తోంది. ఈ డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా, వాటి ఫ‌లితాలు మాత్రం శూన్య‌మ‌నే చెప్పాలి. కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చి వెంట‌నే ఆద‌రాబాద‌రాగా త‌నిఖీలు, చ‌ర్య‌లు తీసుకున్నా అవి నిరుగారిపోతున్నాయి. మ‌త్తు ప‌దార్థాల  ప్రవాహం మాత్రం ఆగడం లేదు. మాద‌క ద్ర‌వ్యాల  మహమ్మారి విజృంభణను అడ్డుకోవాలంటే, మూలం నుంచి చికిత్స అందించాలి. డ్రగ్స్ కు బానిసలైన వారిని ఆ ఊబి నుంచి పూర్తిగా బయటకు తీసుకురావాలి. ప్ర‌భుత్వాలు తెచ్చిన చ‌ట్టాలు నిపుణుల సూచనల మేరకు ఉండాలి. మాదకద్రవ్యాల నిరోధక చట్టం విషయంలో పార్ల‌మెంట్‌లో లోతైన చర్చ జ‌ర‌గాలి.  ఈ చర్చల్లో 'ఓపియం' మొక్కపై ఎక్కువ దృష్టి సారించి, ఈ మొక్క నుంచి హెరాయిన్ వంటి మత్తుపదార్థాలు తయారు చేస్తార‌నే విష‌యాన్ని గ్ర‌హించాలి. కొకెయిన్ ఉత్పత్తికి మూలమైన కోకా, గంజాయి మొక్కల గురించి కూడా చ‌ర్చ‌లు జ‌ర‌పాలి. హడావుడిగా చట్టాలు చేయడం కంటే వాటి అమ‌లు తీరుపై ఎక్కువ‌గా చర్చించాలి, 

మాద‌క ద్ర‌వ్యాల వినియోగం ద్వారా సమాజాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్ర‌మాదంగా విజృంభిస్తోంది.    ప్రజల భావోద్వేగాలను ఓట్లుగా మలచుకోవాలనే ఉద్దేశంతో పాలకులు ఆదరాబాదరాగా చట్టాలు చేస్తున్నారే త‌ప్ప వాటిని అమ‌లు ప‌రుచ‌డంలో నిర్ల‌క్ష్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వాలు మారిన‌ప్పుడ‌ల్లా కాస్తా హ‌డావుడి పెంచి కేసులు న‌మోదు చేస్తున్నాయి. మ‌త్తుకు బానిస‌లు అవుత‌న్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలి. డ్ర‌గ్స్‌ను సామాజిక నేరంగా ప‌రిగ‌ణించాలి. నో అడిక్ష‌న్ మందు వాడ‌డం వ‌ల్ల డ్ర‌గ్స్ నుంచి యువ‌త‌ను స‌న్మార్గంలోకి తీసుకురావొచ్చు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?