Phone tapping : ఫోన్ టాపింగ్ కేసులో మరో ముఖ్యమైన వ్యక్తికి నోటీసులు జారీ....
ఈ నేపద్యంలోనే ఈ కేసులో నిందితులను విచారించగా టాస్క్ ఫోర్స్ అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏకంగా పోలీస్ వాహనాలలోనే ఓ ప్రధాన పార్టీకి చెందిన వారు డబ్బులు తరలించినట్లుగా తెలిసింది.అయితే టాస్క్ ఫోర్స్ అధికారాన్ని ఉపయోగించుకుంటే వాహనాలలో ఎలాంటి తనిఖీలు చేపట్టరు అనే ఉద్దేశంతోనే కొందరు ముఖ్య నేతలు ఈ విధంగా డబ్బులు తరలించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం కస్టడీకి అనుమతిస్తే రాధా కిషన్ నుండి మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కనిపిస్తున్న ఇంటిలిజెన్స్ మాజీ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈరోజు ఆయన హైదరాబాద్ కు వస్తున్నారని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రభాకర్ రావు ఇదివరకే ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఫోన్ టాపింగ్ చేసినట్లుగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంటే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.కాగా తాజాగా ఈ కేసులో మరో ముఖ్యమైన పేరు వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘకాలంగా ఎస్ఐబిలో పనిచేసిన దయానంద రెడ్డి పేరు ప్రస్తుతం ఈ కేసులో బాగా వినిపిస్తుంది.
అయితే ఈ ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావుతో సన్నిహితం ఉన్నట్లుగా తెలియడంతో ఈ కేసులో ఆయన పాత్ర పై పోలీసులు ఆరాతీస్తున్నారు. పోలీసుల విచారణలో ఆయన పై కాస్త అనుమానం కలిగిన దయానంద రెడ్డి పై కూడా చర్యలు తీసుకుంటారని చెప్పాలి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.