Paladugu Nagarjuna : సూర్యాపేట గురుకులంలో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు కారణమైన వారిని క‌ఠినంగా శిక్షించాలి

కేవీపీఎస్ రాష్త్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున  డిమాండ్

Paladugu Nagarjuna : సూర్యాపేట గురుకులంలో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు కారణమైన వారిని క‌ఠినంగా శిక్షించాలి

Paladugu Nagarjuna : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 11 (క్విక్ టుడే) :  సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫెర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి, పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది.  

ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 గంట‌ల‌ ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని, తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయ‌న్నారు.

స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండకపోవడం నిర్వహణ లోపం వలన ఈ ఘటన జరుగుతున్నట్లు తెలుస్తున్నదని అన్నారు. భువనగిరి బాలికల వసతి గృహంలో జరిగిన ఆత్మహత్యలపై ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచ‌నీయమన్నారు. సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి ఆత్మహత్యపై మాజీ మంత్రి సూర్యాపేట స్థానిక శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి స్పందించారని కోరారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?