Nalgonda : గ్రీన్ హిల్స్ సంఘటనలో ఇరు వర్గాలపై కేసు నమోదు.. రిమాండ్
ఈనెల 10వ తారీకు సాయంత్రం 5 గంటల సమయంలో నల్గొండ పట్టణంలోని గ్రీన్ హిల్స్ కాలనీ నందు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నట్లు వివరించారు. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన మేడబోయిన చక్రి,అఖిల్ అనే ఇద్దరు స్నేహితులు. పాత కక్షలు మనసులో పెట్టుకుని మెడబోయిన చక్రి, అతని స్నేహితులైన మహమ్మద్ సమీర్,దోటి ఉపేందర్ కందికట్ల అభిరామ్, గజ్జి హర్షవర్ధన్, వట్టికోటి శేఖర్, మహేష్ అనే వ్యక్తుల్ని పిలిపించుకొని ఎలాగైనా అఖిల్ ని చంపాలన్న ఉద్దేశంతో మద్యం తాగి కుట్ర చేసినట్టు తెలిపారు.
గాయపడిన ఇద్దరు వ్యక్తులు సూరారపు ప్రకాష్ అలియాస్ రాజు, దోటి ఉపేందర్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతుండగా మిగిలిన నేరస్తులు అఖిల్, షోయబులు పరారీలో ఉన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టూ టౌన్ సీఐ డానియల్,ఎస్.ఐ.లు నాగరాజు, సురేష్,సిబ్బంది నరసింహారావు, శంషాద్దీన్,శంకర్, బాలకోటి,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.