SP Chandana Deepti: 20 క్వింటాళ్ల రేష‌న్ బియ్యం అక్రమ నిల్వ చేసిన నిందితుడు అరెస్ట్

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ చందనా దీప్తి

SP Chandana Deepti: 20 క్వింటాళ్ల రేష‌న్ బియ్యం అక్రమ నిల్వ చేసిన నిందితుడు అరెస్ట్

SP Chandana Deepti: నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 23 (క్విక్ టుడే) : ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ  చందన దీప్తి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ చందన దీప్తి  ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం మేరకు నల్ల‌గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ టీం నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో దాడులు చేప‌ట్టారు. నార్కట్ పల్లి పరిధిలో గల ధనలక్ష్మి రైస్ మిల్ ఎదురుగా దోసపాటి వేణు తండ్రి నర్సయ్య నార్కట్ పల్లి కి చెందిన ఇంట్లో  అక్రమంగా నిల్వ ఉంచిన  43 బస్తాల్లో 20 కింటాళ్ల‌  పీడీఎస్ బియ్యం ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు . ఈ సందర్భంగా ఎస్పీ చందనా దీప్తి  మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలైన  గంజా, జూదం బెట్టింగ్, అక్రమ పీడీఎస్ రైస్ రవాణా, లాంటి వాటిని అరికట్టేందుకు నిరంతరం నిఘా పెడుతూ స్పెషల్ డ్రైవ్ లు చేస్తూ విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు. పేద ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పక్కదారి పట్టించిన, ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ లాంటి నేరాలు అలవాటుగా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ చట్టం నమోదు చేస్తామని అన్నారు. అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడం కోసం నిరంతరం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని అన్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?