ఇప్పలగూడెం హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిందితులు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు : డి.ఎస్.పి లక్ష్మీనారాయణ

వివాహేతర సంబంధ విషయం శ్రవణ్ కుమార్ తన సొంత బామ్మర్ది సూర్యాపేట జిల్లా కుడకుడ గ్రామానికి చెందిన బండారి వెంకటేష్ కు వివరించారు. వెంకటేష్ స్వయానా బాబాయ్ కుమారుడైన బండారి సాయికుమార్ సహాయం కోరారు. ముగ్గురు కలిసి వంటల సైదులు ను ఎలాగైనా చంపాలని పథకం పనినట్లు పోలీసు విచారణలో నిందితులు వెల్లడించినట్టు వివరించారు. పథకంలో భాగంగా ఈనెల 3న శనివారం రాత్రి వంటల సైదులు ఇప్పలగూడెం గ్రామం లో బెల్టు షాపులో మద్యం సేవిస్తుండగా వెంకటేష్, సాయి కుమారులు ఇద్దరు అక్కడికి వెళ్లారు. గ్రామ శివారులో ఐకెపి సెంటర్ వద్ద మద్యం సేవిద్దామని వంటల సైదులు తోడుగా తీసుకొని, మద్యం కొనుగోలు చేసి వెంట తీసుకొని వెళ్లారు. శ్రవణ్ కుమార్ కూడా వారి దగ్గరికి చేరుకొని, నలుగురు కలిసి మద్యం సేవించినట్లు వివరించారు. మోదల శ్రవణ్ కుమార్ వంటల సైదులతో కలగజేసుకొని తన భార్యతో ఎందుకు చనువుగా ఉంటున్నావని ఘర్షణ పడ్డారు. దీంతో పెద్ద గొడవ గా మారిందని తెలిపారు. చంపాలని పథకంలో భాగంగానే వెంట తెచ్చుకున్న సుత్తితో శ్రవణ్ కుమార్, వెంకటేశులు వంటల సైదులు కొట్టడంతో చనిపోయాడు. ఘర్షణ జరుగుతున్న సమయంలో రోడ్డుపై సాయికుమార్ కాపలాగా ఉన్నాడు. ఈ హత్యపై కేతపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించినట్లు వివరించారు. ఈనెల 7న ముగ్గురు నిందితులను ఇప్పలగూడెంలో అరెస్ట్ చేసినట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన సుత్తి రెండు బైకులు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన శాలిగౌరారం సిఐ ఎస్ రాఘవరావు.కేతపల్లి ఎస్ఐ శివతేజ, సిబ్బంది మహేష్ అజిత్ రెడ్డిని డిఎస్పీ అభినందించారు.