Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయ రోజే బంగారంతో పాటు వీటిని కొంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
ఇక ఇదే సమయంలో కుజుడు మరియు బుధుడు కలయిక కారణంగా ధనయోగం కూడా ఏర్పడుతుంది. ఇక మేషరాశిలో సూర్యుడు శుక్రుడు కలయిక వలన శుక్రాధిత్య యోగం అలాగే కుంభరాశిలో శని ఉండడం వలన శనియోగం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు మీనరాశిలో కుజుడు సంచరించడం వలన మాలవ్య రాజయోగం కూడా ఏర్పడుతుంది.
బంగారంతో పాటు ఏం కొనాలంటే...
అక్షయ తృతీయ అంటేనే ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. అలాంటి శుభప్రదమైన అక్షయ తృతీయ రోజు బంగారంతో పాటు కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం వలన మంచి జరుగుతుంది.
అయితే ఈ అక్షయ తృతీయ రోజున బంగారం తో పాటు వెండి, కుబేర యంత్రం, భూమి ,శ్రీ యంత్రం ,మట్టి కుండ, వాహనాలు, గవ్వలు, కొబ్బరికాయ ,స్పటిక తాబేలు , శివలింగం లేదా దక్షిణావర్తి శంఖం వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకురావచ్చు.
అయితే అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని తెలుస్తోంది. తద్వారా మీకు ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు అన్ని తొలగి సంతోషంగా జీవిస్తారు.
అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి...
అక్షయ తృతీయ అనేది హిందూ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలాంటి పవిత్రమైన రోజున బంగారం కొనడం మేలును కలగజేస్తుంది. అయితే బంగారం అనేది తరగని లోహం. అంటే ఎప్పటికీ నాశనం కాని లోహం అని అర్థం. అంతేకాక సనాతన ధర్మంలో బంగారాన్ని దైవంగా అత్యంత పవిత్రమైనదిగా పరికిణించడం జరిగింది.
ఇక ఈ బంగారం అనేది బృహస్పతి లోహం లక్ష్మీదేవికి చిహ్నం అని పురాణాలు చెబుతున్నాయి. కావున అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం వలన ఇంట్లో ఆనందం , శ్రేయస్సు ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం. దీనితోపాటు దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. అంతేకాక వారి యొక్క జాతకాలలో బృహస్పతి బలవంతుడై డబ్బుకు లోటు లేకుండా పోతుంది.
అక్షయ తృతీయ రోజు ఏ పని చేయాలి...
అక్షయ తృతీయ రోజు సంధ్యా సమయానికి నది తీరాన స్నానం చేసి , శ్రద్ధ కర్మలు ,బ్రాహ్మణులకు భోజనం ,యాగం, దానధర్మాలు చేయడం వలన మీకు ఎనలేని శ్రేయస్సు కలుగుతుంది.
ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మి నారాయణ కుబేరుని ఆరాధించడం చాలా మంచిది.
అలాగే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం వెండితో పాటు బట్టలు ,పాత్రలు, యంత్రాలు ,భూమి, భవనాలు వంటివి కొనుగోలు చేయడం వలన మంచి జరుగుతుంది. అంతేకాక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే
స్థిరంగా ఉంటుంది... అలాగే ఈరోజు ఏవైనా కొత్త పనులు ప్రారంభించడం వలన వాటిలో పురోగతి సాధిస్తారు.
చేయకూడని పనులు...
అక్షయ తృతీయ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ సిరామిక్ పాత్రలు, ప్లాస్టిక్ , ఇనుము వంటి లోహపు వస్తువులను అసలు కొనుగోలు చేయకూడదు. వీటితో పాటు నల్లని దుస్తులు, ముళ్ళ మొక్కలు ఇంటికి తీసుకురాకూడదు. పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఇలాంటివి చేయడం వలన అశుభం కలుగుతుంది.