Brahma Muhurtham: సరిగ్గా తెల్లవారు జాము 3.45 సమయంలో భూమ్మీద ఏం జరుగుతుందో తెలుసా..?
పూర్వకాలంలో మన ఋషులు ప్రతిదాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశోధించి ఏ పని ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది.అనే తదితర విషయాలను లెక్క కట్టి గ్రంధస్తం చేసి వాటిని ఆచార సాంప్రదాయాల రూపంలో మానవాళికి అందించేవారు. ఈ కోవకు చెందినదే బ్రహ్మ ముహూర్తం. దీనిని గృహం పూర్త సూర్యోదయానికి 96 నిమిషాల ముందు ఉన్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు.

తెల్లవారుజాము రెండు భాగాలుగా విభజిస్తే సూర్యోదయానికి 48 నిమిషాల ముందు కాలాన్ని అస్సలు ముహూర్తం అని ఈ అసలు ముహూర్తానికి ముందు రెండు ఘడియల కాలం అనగా 48 నిమిషాల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఈ ముహూర్తానికి ఆదిదేవత. బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అని పేరు వచ్చింది. బ్రహ్మ ముహూర్త సమయంలో ఏ పని చేసిన అది ఉత్తమ ఫలితాలను ఇస్తుందని మన పురాణాల్లో చెప్పబడింది.
ఈ సమయంలో అనుకూల శక్తి విడుదలవుతూ ఉంటుంది. అది మన మీద ప్రసరించడం వలన మంచి ఆలోచనలు పుడతాయి. అలానే బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉండి స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందుతుంది. విద్యార్థులు ఈ సమయంలో నిద్ర లేచి చదువుకుంటే చదివినది తేలికగా బుర్రకెక్కుతుంది. అందుకే తెల్ల వారుజామున లేచి చదువుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు.
బ్రహ్మం ముహూర్తల్లో నిద్ర లేవడం వలన అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు యొక్క లేనేత కిరణాలు మన మీద పడతాయి. వీటిలో అధిక మొత్తంలో డి విటమిన్ ఉంటుంది. అది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. అలాగే బ్రహ్మ ముహూర్తంలో భూమి మీద దేవతలు తిరుగుతూ ఉంటారు. అందుకే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
ఆ సమయంలో ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి మెడిటేషన్, యోగ ఎక్సైజ్ లాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శరీరం ఎప్పుడు ఉత్సాహంగా, ఫిట్గా ఉంటుంది. మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టిన అది సక్సెస్ అవుతుంది. కాబట్టి రాత్రి సమయంలో తొందరగా పడుకొని బ్రహ్మ ముహూర్తంలో లేస్తే అంత పాజిటివ్ ఎనర్జీ పొందుతారు.