Mahashivratri భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, క్విక్ టుడే : మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివ నామ స్మరణతో శివాలయాలలో తెల్లవారుజాము నుం చే అశేష భక్త జనావళితో మార్మోగుతున్నాయి. మణుగూరు మండలంలోని శివలింగపురం గ్రామానికి చెందిన స్వయంభు నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కోసం క్యూ లైన్ లో గంటల కొద్ది నిల్చుని శివనామ స్మరణ చేస్తూ స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు రామచంద్ర మూర్తి, అద్వైత్ వేదమంత్రోచ్ఛరణలు చదువుతూ నీలకంఠేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఉపవాస దీక్షలతో ఉన్న భక్తులు ప్రత్యేకంగా పూజలు చేశారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం, ఉత్సవ కమిటీ సభ్యులు షామియానాలు ఏర్పాటు చేశారు. శివరాత్రి ఉత్సవంలో భాగంగా భక్తుల ఆరోగ్యరీత్యా వైద్య శిబిరం, ఏర్పాటు చేశారు. అలాగే ఎండ వేడిమికి భక్తుల కోసం చల్లటి మజ్జిగను మణుగూరుకు చెందిన వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.