Vijayadashami: దసరా పండుగ ఎందుకు జ‌రుపుకుంటారో తెలుసా..?

Vijayadashami: దసరా పండుగ ఎందుకు జ‌రుపుకుంటారో తెలుసా..?

Vijayadashami:  మన భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా వివిధ అలంకారాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ పూజలు చేస్తూ గడుపుతున్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా షాపింగ్ లో మునిగి తేలుతూ  అలాగే పిండి వంటకాలు  తో నోరూరేలా సంబరాలు కూడా చేసుకుంటున్నారు. 

 అయితే ఈ దసరా పండుగ అనేది చెడుపై మంచి సాధించిన  విజయంగా జరుపుకుంటారు. అలాగే  శ్రీరాముడు రావణాసురుని చంపినందుకు గాను అలాగే అమ్మవారు మహిషాసురుడుని అంతమందించినందుకు  దసరా పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే  చాలా రాష్ట్రాల్లో వివిధ రకాలుగా పండుగని జరుపుకుంటున్నారు.

 అలాగే మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోనే కనకదుర్గమ్మకు ఎక్కువగా భక్తులనే వాళ్ళు వెళుతూ ఉంటారు. రాష్ట్రమంతా కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉండేటువంటి కనకదుర్గమ్మ అమ్మవారిని 10 రోజులు పాటు పది అలంకారాలతో ఇష్టంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా ఏడు రోజులు ఐపోయింది. ఇంకా పండుగ తేదీ కి మూడు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది.

10 -01
 ఈ దసరా ఉత్సవాలనేవి అక్టోబర్ మూడో తారీకు నుండి ప్రారంభమయ్యాయి. అయితే ఈ దసరా పండుగ అనేది దేశంలోనే హిందువులు జరుపుకునే అతి ముఖ్య పండుగలో ఇది ఒకటి. ఈ పండుగలు అమ్మవారి అందరిని కూడా ఘనంగా అలంకారాలతో అలాగే అభిషేకాలుతో పూజిస్తూ ఉంటారు. అయితే అక్టోబర్ మూడో తారీఖున ప్రారంభమైన ఈ దసరా పండుగ అనేది అక్టోబర్ 12 వ తారీకు వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరు చూసినా సరే దసరా పండుగని ఏ తేదీన జరుపుకుంటారని అందరూ అడుగుతున్నారు. అయితే ఏ తేదీ  మన శాస్త్రాల ప్రకారం మంచిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 అయితే దసరా పండుగ అనేది ఈ సంవత్సరం రెండు రోజుల్లో ఉంటుందట. మొదటగా ఈనెల 12వ తారీఖున ఉదయం 10:58 నిమిషాలకి విజయదశమి అనేది ప్రారంభమయ్యి మళ్లీ మరుసటి రోజు అంటే 13వ తారీఖున ఉదయం 9:30 గంటల వరకు ఉంటుందట. మరి ఇప్పుడు ఏ రోజున పండుగ జరుపుకోవడం మంచిది అని మీలో అందరికీ ప్రశ్న కలుగవచ్చు. అయితే మన శాస్త్రాల ప్రకారం పురోహితులు చెప్పిందేమిటంటే ఏదైనా సరే ఘడియలు మొదలైన రోజునే పండుగ జరుపుకోవాలని అందరూ అంటున్నారు. 

దీన్నిబట్టి మనం చూస్తే అక్టోబర్ 12 వ తారీఖున 10 గంటల తరువాత మనం విజయదశమి పండుగ అనేది జరుపుకోవాలి. దీంతో అన్ని కుటుంబాలకు అలాగే అందరికి కూడా మంచి కలుగుతుందట. ఈ విషయం నువ్వు చదువుతున్నావు కాబట్టి నీకు ఒక్కడికే తెలుస్తుంది. కాబట్టి మీరు ఇతరులకు కూడా ఈ న్యూస్ అనేది షేర్ చేయండి. తద్వారా మీతో పాటుగా మీ బంధువులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. 

10 -03
 అయితే ఇప్పటికే దాదాపుగా ఆరు ఏడు రోజులు  అమ్మవార్లకి  నిత్యం పూజలు అందుకుంటూ ఒకరోజు ఒక్కొక్క అలంకారంతో  ప్రతిరోజు కూడా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నారు. అయితే తెలంగాణలో ఎక్కువగా అమ్మవారిని పూజలు బతుకమ్మ రూపంలో చేసుకుంటారు. కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా అమ్మవారికి ఉత్సవాలనేది నిర్వహిస్తారు. ఈ నవరాత్రులు జరిగే ఈ అమ్మవారి ఉత్సవాలకు ఎంతోమంది  భక్తులు అలాగే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి అధికారులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రాలు దాటి ఇక్కడికి వస్తూ ఉంటారు. 

విజయవాడ కనకదుర్గమ్మ స్వామి ని దర్శించుకుంటే  అన్ని అమ్మవారిని కూడా దర్శించుకున్నట్టే లెక్కని అందరూ అనుకుంటూ ఉంటారు. మరి మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించండి. కుటుంబమంతా హ్యాపీగా జీవనం సాగించండి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?