Dussehra Story : దసరా వెనుక ఉన్న పురాణ కథ ఏంటో మీకు తెలుసా?

Dussehra Story : దసరా వెనుక ఉన్న పురాణ కథ ఏంటో మీకు తెలుసా?

Dussehra Story :  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి హిందువుల ముఖ్య పండుగ దసర. దసరా అనగానే మనకి ముఖ్యంగా గుర్తుకు వచ్చేది దేవి నవరాత్రులు. ఈ పండుగని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా ప్రతిరోజు కూడా వేరువేరు అలంకరణలతో అమ్మవారి లను పూజిస్తారు. ఆంధ్రప్రదేశ్ల లో  విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్నటువంటి కనకదుర్గమ్మ స్వామిని ఎంతోమంది భక్తులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి మరి దర్శించుకుంటారు. అలాగే ఈ దసరా పండుగను తెలంగాణలో బతుకమ్మ రూపంలో జరుపుకుంటారు. ఇలా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజు ఒక రూపంలో అమ్మవారులను కొలుస్తూ కొలుస్తూ ఉంటారు. 

 అలాగే మరికొన్ని గ్రామాలలో ఎంతో మంది ఇష్టంగా అమ్మవారి విగ్రహాలను తయారు చేయించుకొని మరి ఎంతో ఇష్టంగా కొన్ని కోట్లు ఖర్చుపెట్టి మరి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. మరి అలాంటి దసరా పండుగ అనేది ఎందుకు జరుపుకుంటారో దాని వెనుక ఉండేటువంటి పురాణాల్లో ఎలా రాసి ఉన్నాయి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే దసరా వెనుక పురాణా కథల్లో చాలానే విషయం ఉంది.

మహిషాసురుడు అనేవాడు ఒక భయంకరమైన రాక్షసుడు. సకల దేవతలతో భీకరమైన యుద్ధాలను చేస్తూ ఉంటాడు.  అయితే ఒకరోజు ఇంద్రుడిని కూడా ఓడిస్తాడు. ఇక ఈ మహిషాసురుడు నరకాన్ని తట్టుకోలేక ఇంద్రుడు త్రిమూర్తులకు చెబుతాడు. ఇక త్రిమూర్తులు కు వచ్చిన కోపమే ఒక స్త్రీగా జన్మిస్తుంది. తనే ఈ మహిషాసురమర్ధిని. 

12 -03

 త్రిమూర్తులలో ఒకరైన శివుని శక్తి ముఖంగా,విష్ణు యొక్క శక్తి భుజాలు,చేతులు అలాగే బ్రహ్మ శక్తి పాదాలుగా  ఆ స్త్రీకి మహిషాసురుడిని చంపేటి టవంటి శక్తి లభిస్తుంది. శివుడు శూలాన్ని, విష్ణువు యొక్క చక్రాన్ని,ఇంద్రుడు వజ్రాయుధాన్ని,వరుణ దేవుడు పాషాన్ని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని అందించి  మహిషాసుర మర్దిని దేవినియుద్ధానికి సిద్ధం చేసి పంపిస్తారు. 

ఆ యుద్ధంలో మహిషాసురుడిని భీకరమైన యుద్ధం చేసి చంపేస్తుంది. చెడుపై మహిషాసుర మరి దీని సాధించిన విజయం గుర్తుగా ఈ అశ్వయుజ మాసంలో వచ్చే దశమి రోజున  అనగా అక్టోబర్ 12 వ తారీఖున  ఈ విజయదశమి అనే పండుగ జరుపుకుంటారు. దేవీ నవరాత్రులలో అమ్మవారి రూపం మహిషాసుర మర్దిని రూపమే. 

 ఇటువంటి మహిషాసురుడిని చంపిన మహిషాసుర మర్దిని దేవిని ఈ దశమి రోజున పూజిస్తే అంతా మంచే జరుగుతుంది అని అందరూ భావిస్తూ ఉంటారు. కనుక ఎక్కువ మంది భక్తులు అమ్మవారికి ఇష్టంగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఇష్టమైన నైవేద్యాలను అందిస్తూ ప్రజలు చేస్తూ ఉంటారు. ఈ విజయదశమి రోజున అమ్మవారిని అయిగిరి నందిని అనే స్తోత్రం తో పూజిస్తే అంత మంచే జరుగుతుంది పురాణాలు చెబుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ప్రతి ఒక్కరు కూడా విజయదశమి నవరాత్రులలో అందరూ ఏకమై ఒక గూటికి చేరి అమ్మవార్లకు ఎన్నో రకాలుగా  అన్ని అలంకారాలతో ఒక్కొక్క రోజు పూజలు చేస్తూ ఉంటారు. 

12 -02

 అయితే చాలామంది భక్తులు కేవలం  విజయదశమి నవరాత్రుల్లో భాగంగానే అమ్మవార్లకు పూజలు చేస్తూ ఉంటారు. కానీ మీకు ఎప్పుడైనా బాధలు లేదా కష్టాలు అనేవి కలిగినప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ అమ్మవారి దేవాలయానికైనా వెళ్లి పూజించడం వల్ల చాలా మంచి కలుగుతుందని అలాగే అయిగిరి నందిని అనే స్తోత్రాన్ని జపిస్తూ ఉంటే మీకు ఎన్నడూ లేనటువంటి శక్తి కలుగుతుంది. తద్వార మీరు అలాగే మీ కుటుంబం అందరూ కూడా ఆనందంగా జీవించవచ్చు. 

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే అమ్మవారు లో ఉత్సవాలను ఘనంగా జరుపుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అన్ని రకాలైనటువంటి అమ్మవారి సన్నిధులలో సంతోషంగా చేస్తూ అందరికీ కూడా ఆదర్శంగా చాలామంది నిలుస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల అయితే కొన్ని కోట్ల నోట్ల కట్టులతో అమ్మవారికి పూలదండలు అలాగే స్టేజికి  డెకరేషన్లు చేస్తూ ఉన్నారు. ఇలా ఎక్కడ చూసినా సరే అమ్మవారి మీద భక్తి ప్రేమతో పలు పలు రకాలుగా ఎన్నో వింత చేష్టలు కూడా చేస్తూ ఉన్నారు. 

అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి ఉత్సవాలనేవి ప్రతి ఏటా కూడా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము. ప్రతి ఒక కుటుంబానికి అలాగే ప్రతి ఒక్క జీవికి కూడా అమ్మవారిని పూజించడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని ప్రతి ఒక్కరు కూడా బలుపులు అమ్మవార్లకు పూజలు చేస్తూ ఉంటారు. అయితే రాముడు రావణాసురుడిని అలాగే మహిషాసుర మర్దిని మహిషాసురుడిని చంపినందుకు గాను మనం ఈ పండుగను అనేది ఘనంగా ప్రతి ఏటా విజయదశమి రోజున జరుపుకుంటాం.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?