Ganesh Chaturthi: స్వాతంత్య్రోద్యమంలో భారతీయులను ఏకం చేసిన గణపతి ఉత్సవాలు.. బాగంగాధర్ తిలక్ స్ఫూర్తితో నేటికీ కొనసాగింపు..
ఇందులో భాగంగా ఇంటికే పరిమితమైన గణపతి పూజను నవరాత్రులుగా మలిచిన ఘనత లోకమాన్య బాలగంగాధర తిలక్ సొంతం. బ్రిటిష్ ప్రభుత్వ నిర్బంధాన్ని ధిక్కరించేందుకు, దైవభక్తికి దేశభక్తిని జోడిరచిన అపురూప సందర్భం గణపతి నవరాత్రులు. వలస పాలనలో వివక్షకు లోనవుతున్న భారతీయ సంస్కృతి, సంప్రదా యాలను పునరుద్ధరించేందుకు తొమ్మిది రోజుల వేడుక ఒక ప్రత్యేక సందర్భం. జాతీయోద్యమంలో భాగంగా మహారాష్ట్ర పుణెలో 1893లో లోకమాన్య తిలక్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు పిలుపునిచ్చారు.
1895, మార్చి 27న శాలిబండలో ఉగాది పర్వదినం రోజున భారత గుణవర్థక్ సంస్థను స్థాపించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న మహారాష్టీయ్రులైన బాలచంద్ర దీక్షిత్, వక్రతుండ దీక్షిత్, నారాయణరావు పిల్‌ఖానె, లక్ష్మణరావు సదావర్తె, దాదాచారి కాలె తదితర మిత్ర బృందం సారధ్యంలో మరికొందరి స్థానిక కాయస్తులు, వ్యాపారవేత్తల సహకారంతో ఆ మరాఠా సంస్థను నెలకొల్పారు. అప్పటి నుంచి కులమతాలకతీతంగా అందరూ కలిసి గణపతి మండపాలను నెలకొల్పడం,
తద్వారా రాజకీయ చర్చలు, స్వాతంత్య స్ఫూర్తిని యువతలో ప్రేరేపించే సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే క్రతువుకు శ్రీకారం జరిగింది. ఆ సంస్థ పాలకవర్గ సభ్యులు నేటికీ గణేశ్ నవరాత్రి వేడుకలను కొనసాగిస్తున్నారు. అప్పట్లో చెరువుల్లోని నల్లమట్టినే వినాయక ప్రతిమల తయారీకి వాడేవారు. చవితినాడు మట్టిగణపయ్యను ప్రతిష్ఠించి, తొమ్మిది రోజుల పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించేవారు.
సాయంత్రం వేళల్లో 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జానపద నృత్యాలు, గీతాలాపన, భక్తి కీర్తనలు, భజన, పారాయణం, పద్య, ఇతిహాస నాటకాలు, సంగీత కచేరీ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు, ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఆ కార్యక్రమాలు చూసేందుకు పెద్ద ఎత్తున మండపాల వైపు తరలి వచ్చేవారు. ఆ పూజా కార్యక్రమాలు, కళా ప్రదర్శనలే దేశ సమైక్యతకు స్ఫూర్తిగా నిలిచేది.
అలాంటి పరిస్థితులలోనూ నిజాం ప్రభుత్వం సమ్మతించేలా గణపతి నవరాత్రులు నగరంలో జరగడం విశేషం. ప్రారంభంలో శాలిబండ నుంచి నగరంలో మరికొన్ని ప్రాంతాలకు గణేశ్ ఉత్సవాలు విస్తృతమయ్యాయి. తొమ్మిది రోజుల పాటూ రోజూ సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు కుటుంబంతో సహా వెళ్లేవాళ్లం. రెండు కళ్లు చాలవు అన్నంతగా సంబరాలు జరిగేవి. పదో రోజు తెల్లవారుజామున పిల్లలు, పెద్దలు అంతా కలిసి మట్టి గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీలో నిమజ్జనం చేసేవాళ్లు.
అలా మొదలైన ప్రస్థానం ఇప్పుడు ఊరూవాడా విస్తరించింది. ఛత్రపతి శివాజీ పరిపాలనా సమయంలోనే మరాఠా రాజ్యంలో వినాయక ఉత్సవాలు ప్రారంభం అయ్యాయని కొందరు చరిత్రకారులు అంటారు. వినాయకుడిని పీష్వాలు తమ కులదేవుడిగా ఆరాధిస్తారు. కనుక 17వ శతాబ్దంలో శివాజీ చేతుల విూదుగా గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయని కొందరి అభిప్రాయం.
ఆయన స్ఫూర్తి కొనసాగింపుగా లోకమాన్య తిలక్ శివాజీ ఉత్సవాలు, గణేశ్ ఉత్సవాలను ప్రారంభించారని చారిత్రక అధ్యయనకారులు చెబుతారు. భాగ్యనగర గణపతి నవరాత్రి ఉత్సవాలు నగర ప్రజల సామరస్య జీవనానికి, ఐకమత్యకు అద్దం పడతాయి. హైదరాబాద్‌లోని కొన్ని వినాయక మండపాలలో లంబోదరుడి లడ్డూ ప్రసాదాన్ని కొందరు ముస్లిం, క్రిష్టియన్లూ వేలంపాట ద్వారా దక్కించుకోవడం అందుకు తార్కాణం. అంతేకాదు,
చార్మినార్ తదితర ప్రాంతాలలో గణపతి శోభాయాత్ర సమయంలో కొందరు ముస్లింలు ఎదురెళ్లి భక్తులకు మంచినీరు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. అలా నగరంలో వినాయకచవితి జోష్ నెలకొంది. రోడ్ల నిండుగా విగ్రహాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ తరవాతే లడ్డూ వేలాలు మొదలయ్యాయి. బాలాపూర్, ఖైరతాబాద్ ప్రసిదిద్దికెక్కాయి.