Hemkund Sahib Yatra Start : అత్యుత్తమ పవిత్రమైన గురుద్వారా యాత్ర ప్రారంభం.. ఎప్పటినుంచంటే..

Hemkund Sahib Yatra Start : అత్యుత్తమ పవిత్రమైన గురుద్వారా యాత్ర ప్రారంభం.. ఎప్పటినుంచంటే..

Hemkund Sahib Yatra Start : ఉత్తరాఖండ్ లోని చమేలీ జిల్లాలో ఉన్న సిక్కుల పవిత్ర స్థలాల్లో ఒకటైన హేమకుండ్ గురుద్వారా మే 25న  తెరచుకోనుంది. ఈ ఏడాది శ్రీ హేమకుండ్ సాహిబ్ యాత్ర మే 25 నుండి అక్టోబర్ 10 వరకు కొనసాగుతూ ఉంటుంది. హేమ్ కుండ్ గురుద్వారా సిక్కుల పదవ గురువు అయినా గురు గోవింద్ సింగ్ తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇది.

అయితే ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తైన గురుద్వారా. దీనితో పాటుగా బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి,యమునో త్రి దామ్ నాలుగు దామ్ లా తలుపులు తెరిచేందుకు తేదీని ప్రకటించారు. హేమకుండ్ సాహిబ్ యాత్రకు సన్న హాలు ఎంతో ముమ్మరంగా  సాగుతున్నాయి. ఈ యాత్రకు సన్నహంగా సైనికులు హేమ కుండ్ సాహిబ్ యాత్ర మార్గం నుండి మంచును తొలగించేందుకు పనులు చేస్తున్నారు.

ఆర్మీ సైనికులు ప్రార్థనలు చేసిన తరువాత గురుద్వారా ప్రాంగణం తలుపులు తెరుస్తారు. హేమ కుండ్ అనేది సంస్కృత పేరు. అనగా హేమ్ అంటే మంచు. కుండ్ అంటే గిన్నె. ఇక్కడ ఉన్నటువంటి సరస్సు దాని చుట్టూ ఉన్నటువంటి పవిత్ర స్థలాన్ని ప్రజలు లోక్ పాల్ అని పిలుస్తారు. ఈ గురుద్వారా అనేది ఏడాదిలో  ఐదు నెలలు మాత్రమే దర్శనం కోసం తెరిచి ఉంచుతారు.

1002 -2

మిగిలిన టైంలో ఇక్కడికి చేరటానికి రోడ్డు మంచు తో కప్పబడి ఉంటుంది. భక్తులు గోవింద్ ఘట్ చేరటానికి సవారీ చేస్తారు. అయితే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రహదారిని కాలినడకన కవర్ చేయాలి. ఈ మార్గంలో ఎప్పటికీ కూడా మంచు ఉంటుంది..

ఈ ప్రదేశం అనేది రామాయణ కాలానికి సంబంధించినది అని హేమకుండ్ సాహిబ్ గురించి ఒక మతపరమైన నమ్మకం అనేది ఉన్నది. పూర్వం ఇక్కడ ఒక ఆలయం ఉన్నది. దీనిని రాముడు సోదరుడు అయిన లక్ష్మణుడు నిర్మించాడు.  ఇక్కడికి వచ్చినప్పుడు గురు గోవింద్ సింగ్జి 20 ఏళ్ల పాటు కఠోరమైన తపస్సు చేశాడు అని ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి.

దీని గురించి గురు గోవింద్ సింగ్ రచించినటువంటి దశం గ్రంథం లో తెలిపారు. గురువుకు సంబంధించిన ప్రదేశం కావటం వలన ఈ ప్రదేశం తరువాత గురుద్వారాగా మారింది. ఈ గురుద్వారా దగ్గరలో లక్ష్మణుని ఆలయం కూడా ఉన్నది. హేమ కుండ్ సాహెబ్ గురుద్వారా దృశ్యం ఎంతో సుందరమైనది. గురుద్వారాకు దగ్గరలో ఒక సరస్సు కూడా ఉన్నది.

1002 -4

ఇందులో హాతి పర్వతం, సఫ్ట్  రీషీ పర్వతం నుండి నీరు అనేది వస్తుంది. ఈ సరస్సు ను హేమ్ సరోవరం అని పిలుస్తారు. ఈ సరస్సులోని నీటిని తాగటం వలన లేక స్నానం చేయటం వలన ఎన్నో రకాల సమస్యల నుండి  మరియు పాపాల నుండి ఉపశమనం కలుగుతుంది అని నమ్ముతారు. దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ ప్రదేశం చుట్టూ కూడా ఏడు పెద్ద పర్వతాలు ఉన్నాయి..

హేమకుడ్ సాహిబ్ అస్థ మార్గం నుండి మంచు తొలగించె పనులు జరుగుతున్నాయి. యాత్రలో నిర్వహించే ఈ గురుద్వారా ట్రస్ట్ లోని సైన్యం, సేవకులు మంచు గుండ ప్రయాణం చేసి హేమకుండ్ సాహెబ్ పవిత్ర భూమికి చేరుకుంటారు. అర్దాస్ తర్వాత 35 మంది ఆర్మీ సభ్యులు మరియు ట్రస్ట్ నుండి 15 మంది సేవకుల సమక్షంలో గురుద్వారా ప్రాంగణం ప్రధాన ద్వారం తెరిచారు.

ఈ గురుద్వారా ప్రధాన ద్వారం తెరవగానే హేమకుండ్ సాహిబ్ నుండి సైనిక సైనికులు, సైనికుల హేమకుండ్ సాహెబ్ అస్థ మార్గం నుండి మంచిని తొలగించే పనులు ప్రారంభించారు. గంగరియ నుండి రెండు కిలోమీటర్లు ముందు ఉన్న అటల కోటి గ్లేషియర్ పాయింటు దాటి ఈ యాత్ర మార్గం మంచుతో కప్పబడి ఉన్నది.

1002 -3

చార్ దామ్ సన్నహాలకు సంబంధించిన రవాణా దారులతో ARTO సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రవాణా దారులు మాట్లాడుతూ. రిషి కేస్ నుండి హేమకుండ్ సాహిబ్ కు వారంలో వన్ వే ప్రయాణికులు మాత్రమే అందుబాటులో ఉంటారు. అక్కడ నుండి వచ్చేటటువంటి ప్రయాణికులను రిసీవ్ చేసుకున్న వారం తరువాత యావరేజ్ కరెక్ట్ అవుతుంది.

ఈ గురుద్వారా కు సంబంధించిన మేనేజర్ మాట్లాడుతూ. ఈ యాత్ర అనేది గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు బస్సులనేవి తిప్పడం లేదు. రొటేషన్ పేరుతో గురుద్వారా ప్రాంతంలో బుకింగ్ కౌంటర్ ను ప్రారంభించేందుకు ఈ సమావేశంలో ఆయన అంగీకరించాడు.

గురుద్వారా ప్రాంతంలో రెండు లేక మూడు బస్సులు పార్కింగ్ చేస్తారు. ఉదయాన్నే హేమకుండ్ సాహిబ్ కు బస్సులు పంపుతారు. స్థానిక ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించేలా బస్సుల ఆపరేటర్లు ప్రయాణికులకు అవగాహన కల్పించాలి అని ఏఆర్ టిఓ అన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?