గుండాల, క్విక్ టుడే : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి పురస్కరించుని ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని బండ కొత్తపల్లి, పెద్ద ప డి శాల, తుర్కలశాపురం, గుండాల, వెల్మజాల, సుద్దాల, అనం తా రం గ్రామాలలో ఉన్న శివాలయాల్లో భక్తులు బారులు తీరి పూజలు నిర్వహించారు. ఉపవాసం ఉన్న భక్తులు శ్రీ కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గోత్రనామాలు, అర్చనలు నిర్వహించి అనంతరం స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించి పండుగ వాతావరణం కల్పించే విధంగా ఘనంగా ఏర్పాట్లు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూజారులు కొల్లవవజ్జుల శ్రీనివాస్ శర్మ, రమేష్ శర్మ, శిల్పోజు లింగమూర్తి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.