Palani Subrahmanya Swami : ఈ దేవుడిని దర్శించుకుంటే చాలు.. పోయిన వస్తువులు తిరిగి వస్తాయట..
ఆ వస్తువు గనుక దొరికితే కొన్ని ప్రత్యేక పూజలు మరియు వ్రతాలు చేస్తాము అని ముడుపు కడుతూ ఉంటారు. అయితే ఈ స్వామిని దర్శించుకుని పూజించటం వలన మిస్సయిన వస్తువులు తిరిగి పొందుతారు అనే నమ్మకం ఉంది అని కొందరు భక్తులు అంటున్నారు.
అయితే అదే రాష్ట్రంలోని తిరుత్తనిలో కొలువైనటువంటి మురుగన్ స్వామి ప్రత్యేక వరాలు ఇచ్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. దేవసేన సమేతంగా కొలువైన సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉండే ఈ ఆలయం ఎంతో పురాతనమైనదిగా చెబుతున్నారు. ఈ ఆలయం సుమారు 1600 ఏళ్ల కిందట పల్లవ చోళ రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయి.
ఈ క్షేత్రానికి ఉత్తరం వైపున ఓ పర్వతం కూడా ఉంటుంది. ఈ పర్వతం తెల్లగా ఉండటం వలన దీనిని బియ్యపు కొండలు అని కూడా పిలుస్తారు. తిరుత్తని క్షేత్ర స్థల పురాణం ప్రకారం. ఈ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవిని వివాహం చేసుకునేందుకు బోయకాల రాజులతో యుద్ధం చేశాడు అని చెప్తారు. దాని తరువాత ఇక్కడ కొలువయ్యారు అని చెబుతున్నారు.
ఈ క్షేత్రాన్ని శాంతిపురి తణిగా అని కూడా అంటారు..ఈ స్వామిని కనక దర్శించుకున్నట్లయితే ఏదైనా వస్తువు మనం గనక పోగొట్టుకున్నట్లయితే తిరిగి దానిని పొందుతారట. ఒక టైంలో బ్రాహ్మ ను కుమారస్వామి బంధిస్తాడు. దీని వలన తాను సృష్టించే శక్తి కోల్పోతాడు. దీనివల్ల తిరుత్తణి లో ఉన్న మురుగణ్ పూజించడం వల్ల తిరిగి తన శక్తిని పొందుతాడట.
మరో చరిత్ర ప్రకారం. ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న తన సంఘనీతి. పద్మానీతి, చింతామణి, ఐశ్వర్యాలను సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన తరువాత తిరిగి పొందాడు అని చెబుతున్నారు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించడం వలన పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుతారు అని పేరు కూడా వచ్చింది..