Pannala Srinivas Reddy : మేడిప‌ల్లి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ గా పన్నాల శ్రీనివాస్ రెడ్డి  

మేడిపల్లి వీరాంజనేయ స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Pannala Srinivas Reddy : మేడిప‌ల్లి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ గా పన్నాల శ్రీనివాస్ రెడ్డి  

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం : ,పన్నాల శ్రీనివాస్ రెడ్డి
Pannala Srinivas Reddy : మేడిప‌ల్లి, క్విక్ టుడే : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నూతన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్గౌడ్, బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పాల్గొని నూతన కమిటీ సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

137 -2

దేవాదాయ అధికారులు నూతన ఆలయ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలను అందించారు. శ్రీ వీరాంజనేయ స్వామి నూతన ఆలయ కమిటీ చైర్మన్ గా పన్నాల శ్రీనివాస్ రెడ్డి, నూతన డైరెక్టర్లుగా నారోజు జంగాచారి, లోడే పవన్ కుమార్ గౌడ్, బార్ల నాగరాజు, ఎర్ర ఐలేష్ యాదవ్, కొల్తూరి కుమార్, ముదిగొండ మహేశ్వరి నియామక పత్రాలు అందుకున్నారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ దేవుని సేవ చేసే అదృష్టం కలిగిన నూతన సభ్యులు అదృష్టవంతులని, ఆలయాన్ని అన్ని సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

అనంతరం నూతన చైర్మన్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శక్తివంచన లేకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, పార్టీలకతీతంగా కార్పొరేషన్ పరిధిలోని నాయకులు, భక్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. అదేవిధంగా నూతన కమిటీని ఎన్నిక చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రు నాయక్, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?